• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా సిల్క్ రోడ్: పర్యవసానాలకు పశ్చిమ దేశాలదే బాధ్యత

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ /బీజింగ్: అంతర్జాతీయంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న చైనాను నిలువరించేందుకు భారత్ కూడా వివిధ దేశాలతో దౌత్యపరంగా, ఆర్థిక ద్వైపాక్షిక బంధాల బలోపేతం దిశగా పరుగులు తీస్తున్నది. 1991లో సోవియట్ యూనియన్ అంతర్ధానం.. 1979లో చైనాలో ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభం వంటి చర్యలు అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చైనా, రష్యా పట్ల పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికా అనుసరించిన వ్యూహం ఫలితమే ఈ పరిణామం అని చెప్తారు.

భారత్ 1990వ దశకం ప్రారంభంలో బోరిస్ ఎల్సిన్ హయాంలో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నించింది. కానీ1997లో రష్యా 'జీ - 7' గ్రూప్‌లో చేరిపోయింది. అంతకుముందు 1994లో నాటో పార్టనర్ షిప్ ఫర్ పీస్ ప్రోగ్రాంలో చేరిపోయింది. ప్రచ్చన్నయుద్ధం ముగిసిన దరిమిలా రష్యా లొంగుబాటు తర్వాత 1999 ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు 'నాటో' కూటమి విస్తరణ ప్రణాళిక అమలుకు పూనుకున్నాయి.

రష్యా అభ్యంతరాలు తోసిపుచ్చి మరీ పాత సోవియట్ దేశాలు.. వార్సా మాజీ సభ్య దేశాలను చేర్చుకుని తూర్పు దేశాల వైపు నాటో కూటమి విస్తరణకు పూనుకున్నాయి. నాటో విస్తరణతోపాటు రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికా మద్దతుతో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ పరిణామం 2008లో జార్జియా సంక్షోభం, 2014 వరకు ఉక్రెయిన్‌లో జోక్యం వరకు ఈయూ దేశాలు చేరుకున్నాయి. ఉక్రెయిన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకు 2014లో నాటోలో రష్యా సభ్యత్వం సస్పెండ్ చేశారు.

Why the West is responsible for China’s OBOR project

రష్యాకు అడ్డుకట్ట.. చైనాకు పశ్చిమ దేశాల ప్రోత్సాహం

రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించిన పశ్చిమ దేశాలు.. అదే స్థానంలో చైనా ఎదుగుదలకు చోటు కల్పించాయి. 1979 నుంచి అంతర్జాతీయ సమాజంలోని సమగ్ర చైనా వ్యూహం పేరిట పశ్చిమ దేశాల కార్పొరేట్ సంస్థలు చైనాలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక లబ్ధి పొందడానికి యత్నించాయి. ఇక 1991 నుంచి అంతర్జాతీయంగా సరళీక్రుత పరిస్థితులకు అనుగుణంగా... చైనా తన నియమ నిబంధనలకు అనుగుణంగా పశ్చిమ దేశాల కార్పొరేట్లకు ద్వారాలు తెలిసింది.

అదే సమయంలో చైనా సవాళ్లకు స్వాగతం పలుకుతూ ముందుకు సాగితే పశ్చిమ దేశాల్లో ప్రతిస్పందన కొరవడింది. దక్షిణ చైనా సముద్రంలో నిర్మాణాలు చేపడుతున్నా చైనాను అమెరికా నిలువరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదన్న అభిప్రాయం ఉంది. 2008లో బారతదేశంతో అమెరికా పౌర అణు ఇంధన సహకార ఒప్పందం కుదుర్చుకునే వరకు చైనా ప్రతిస్పందించలేదు. కానీ ఆ తర్వాత న్యూక్లియర్స్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ) నుంచి ఎటువంటి ఆమోదం లేకుండానే పాకిస్థాన్‌కు రెండు అదనపు అణు ఇంధన ప్లాంట్లు సరఫరా చేస్తామని చైనా ప్రకటించింది.

ఆఫ్ఘన్ పునర్వ్యస్థీకరణలో చైనాకు అమెరికా మద్దతు

పరిస్థితి ఇలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్ పునర్వ్యవస్థీకరణలో చైనాను అమెరికా పోత్సహించింది. తాలిబన్లతో సయోధ్య కోసం చైనా ద్వారా ప్రయత్నాలు సాగించింది. తాజాగా నిర్మాణంలో ఉన్న 'చైనా - పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్'తో పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించవచ్చునని అమెరికా ఆశలు పెట్టుకున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంతకుముందు తన ఎన్నికల ప్రచారంలో చైనా చట్ట విరుద్ధ వాణిజ్య లావాదేవీలకు చెక్ పెడతానని ప్రతీన బూనారు. దానికి బదులు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాత్రం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధ సమస్యల పరిష్కారానికి గత నెలలో 100 రోజుల ప్రణాళిక ప్రకటించారు. చైనా కూడా సంయుక్త ప్రకటనలో బీఫ్, బయో టెక్నాలజీ ఉత్పత్తుల దిగుమతితోపాటు క్రెడిట్ రేటింగ్ సంస్థలు, క్రెడిట్ కార్డు సంస్థల రాకను అనుమతిస్తామని పేర్కొన్నది.

పరస్పర లావాదేవీలతో బలోపేతం కావాలని చైనా, అమెరికా నిర్ణయం

చైనాతో ఎల్ఎన్‍జీ ఎగుమతులను పరిగణనలోకి తీసుకోవడానికి అమెరికా అంగీకరించింది. చైనా పెట్టుబడులను అమెరికా స్వాగతించింది. చైనా బ్యాంకులను కూడా ఇతర విదేశీ బ్యాంకుల మాదిరిగానే అమెరికా గుర్తించింది. తద్వారా వివిధ దేశాలను కలుపుతూ చైనా నిర్మించే ఒన్ బెల్ట్, ఒన్ రోడ్ ఇన్సియేటివ్‌లో భాగంగా బెల్ట్ అండ్ రోడ్ ఫోరం అనే పేరుతో నిర్వహించిన సదస్సుకు అమెరికా ప్రతినిధి బ్రుందాన్ని పంపింది. ఇంతకుముందు చైనా సారథ్యంలోని ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంక్ ఏర్పాటు ప్రక్రియకు దూరంగా ఉన్నదీ అమెరికా. రెండు దేశాలు ఒక ఏడాది ప్రణాలిక అమలుకు అంగీకరించాయి. పరస్పరం సహకారంతో ఆర్థిక లావాదేవీలతో బలోపేతం కావాలని నిర్ణయించుకున్నాయి. కానీ ట్రంప్ పదేపదే ఉత్తర కొరియా అణ్వస్త్ర, క్షిపణుల సవాళ్లను ప్రస్తావిస్తారని చైనా వాదిస్తున్నది.

Why the West is responsible for China’s OBOR project

డైలమాలో భారత్

చైనాకు భిన్నంగా భారతదేశం పలు రంగాల్లో డైలమాలో ఉన్నది. భారత విదేశాంగ విధానంలో కీలక పాత్ర పోషిస్తున్న రష్యా.. పశ్చిమ దేశాలతో ఇబ్బందుల ద్రుష్ట్యా.. చైనాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నది. అందుకే ఇటీవల చైనా నిర్వహించిన బెల్ట్ అండ్ రోడ్ ఫోరం సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మరోవైపు హెలికాప్టర్ల సరఫరా, సంయుక్త సైనిక విన్యాసాల ద్వారా పాకిస్థాన్‌తోనూ రష్యా అనుబంధాన్ని పెంచుకుంటూ తాలిబన్ల ఏరివేతకు పూనుకుంటున్నది.

ఈయూ దేశాల్లో స్తంభించిన ఆర్థిక వ్యవస్థ

యూరోపియన్ దేశాలు ఆర్థిక వ్యవస్థ స్తంభనతో సతమతం అవుతున్నాయి తద్వారా ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఎదురుచూస్తున్నాయి. గత దశాబ్ది కాలంలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా చైనాతో వాణిజ్య, పెట్టుబడులు, ఆర్థిక రంగాల్లో కలిసి ముందుకు వెళ్లడంలో పోటీ పడ్తున్నాయి. పారదర్శకత లోపంతో రుణ భారాన్ని మోస్తున్నా దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలు, ఆఫ్రికా ఖండ దేశాలు కూడా చైనాను ఎదుర్కొనేందుకు విఫల యత్నం చేశారు. ఈ తరుణంలో చైనాకు పోటీగా వివిధ దేశాల్లో భారత్ సమర్థవంతంగా దౌత్యపరంగా, ఆర్థికంగా లావాదేవీలు నిర్వహిస్తుందనడంలో సందేహం లేదు. అమెరికాతో ప్రవాస భారతీయుల సహకారంతో తప్పనిసరిగా భారత్ తన సంబంధాలు బలోపేతం చేసుకోక తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు.

English summary
Since the dissolution of the Soviet Union in 1991, and initiation of Chinese economic reforms in 1979, two approaches have characterised western, particularly the US’, strategy towards Russia and China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more