జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో: వరద ప్రవాహాం, మునిగిన ఆలయం, నిండుకుండల్లా చెరువులు

|
Google Oneindia TeluguNews

వర్షాలు, వరదతో తెలంగాణ రాష్ట్రం అల్లాడుతుంది. ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా చేరింది. దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే జనాలను తరలించారు. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదనీటితో గోదావరి పరివాహక ప్రాంతాల్లో గల ఆలయాలు మునిగిపోయాయి. కొంచెం మాత్రమే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల చెరువు కట్టలు తెగిపోతున్నాయి. దీంతో గ్రామంలోకి నీరు రావడం.. పొలాలు నీటితో నిండిపోయాయి.

మునిగిన ఆలయం..

మునిగిన ఆలయం..


గోదావరి నదీ తీరం ఎర్దండి గంగ.. ఇదీ ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో ఉంది. ఇక్కడ వరదనీరు పోటెత్తింది. వరదలో శివాలయం కూడా పూర్తిగా మునిగిపోయింది. ఆ వీడియోను డ్రోన్ ద్వారా తీశారు. గ్రామం కాస్త దూరంలో ఉండటంతో జనం బతికి బయటపడ్డారు. కానీ ఇంట్లోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

 చెరువుల ప్రవాహం

చెరువుల ప్రవాహం


ఇటు చాలా చోట్ల చెరువు కట్టలు తెగిపోతున్నాయి. కోరుట్ల మండలం అయిలాపూర్ చెరువు కట్ట తెగిపోయింది. దీంతో ఆ గ్రామంలోకి వరదనీరు వచ్చింది. అటు వైపు జనాలు వెళ్లొద్దు అని స్థానిక అధికారులు సూచించారు. గ్రామంలోని జనం కూడా భయాందోళనలో ఉన్నారు. చాలా మంది ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో వారు కూర్చొలేని.. ఉండలేని పరిస్థితి ఉంది. ఇలా న్యూస్ వైరల్ కాగా.. అయిలాపూర్ సర్పంచ్ మాత్రం అదేమి లేదని చెప్పారు. వదంతులు ప్రచారం చేయొద్దని కోరారు. అంతా బానే ఉందని వివరించారు.

 జేసీబీతో మత్తడి తీసి

జేసీబీతో మత్తడి తీసి


మరోవైపు మెట్ పల్లి మండలం వేంపేటలో కూడా పెద్ద చెరువు వద్ద నీరు ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో జేసీబీ ద్వారా మత్తడి తీశారు. దీంతో నీటి ప్రవాహం కిందకి వెళ్లింది. గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ విభాగం సహాయంతో చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరో 3 రోజులు ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో పాఠశాలలకు మరో 3 రోజులు సెలవు ఇచ్చారు. తిరిగి సోమవారం రోజున స్కూల్స్ పున: ప్రారంభం అవుతాయి.

English summary
flood water flow at river bank premises. shiv temple drown in erdandi area
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X