• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్తను చంపేందుకు భార్య కుట్రలు: చివరకు ప్రియుడితో కాల్చి చంపించింది

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న దారుణాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. క్షణిక సుఖం కోసం కట్టుకున్న భాగస్వాములను అంతం చేస్తున్నారు. చివరకు కన్న పిల్లలను అనాథలుగా మారుస్తున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

భర్తకు దూరంగా.. ప్రియుడికి దగ్గరగా..

భర్తకు దూరంగా.. ప్రియుడికి దగ్గరగా..


ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళితో గోదావరిఖినికి చెందిన కొరకొప్పుల రాజేందర్‌(28)కు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయినప్పటికీ రాజేందర్‌కు రవళి దూరంగా ఉంటూ వచ్చింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన భర్త అనేకసార్లు నిలదీశాడు. ఇటీవలే జరిగిన పంచాయితీలో ఇకపై కలిసి జీవిస్తామని ఆమె అంగీకరించింది. అయితే, తన అత్తామమలతో కలిసి ఉండటం రవళికి ఇష్టం లేకపోవడంతో రాజేందర్‌ పక్కనే వేరు కాపురం పెట్టాడు.

భర్తను ప్రియుడితో కాల్చి చంపించి.. కథ అల్లింది

భర్తను ప్రియుడితో కాల్చి చంపించి.. కథ అల్లింది


ఆర్నెళ్ల క్రితమే తండ్రి వారసత్వంగా సింగరేణి ఉద్యోగంలో చేరి శ్రీరాంపూర్‌ ప్రాంతంలో పనిచేస్తున్నాడు రాజేందర్. శుక్రవారం విధులకెళ్లి వచ్చి రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. ప్రియుడితో తన భర్తను చంపించాలని ప్లాన్ వేసిన రవళి... తెల్లవారుజామున ఇంటి తలుపులు తెరిచిపెట్టింది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకడు లోపలికి వెళ్లి రాజేందర్‌ కుడి కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే వచ్చిన ఇద్దరూ పరారయ్యారు.కాగా, తుపాకీ శబ్దానికి పక్కనే ఉంటున్న తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారు బయటకు వచ్చి రాజేందర్‌ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి మంచంపై రక్తపుమడుగులో పడి ఉన్నాడు. దారుణమంతా పది నిమిషాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. వీధిలోని సీసీ కెమెరాలో నిందితులు వచ్చి వెళ్తున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. తాను టాయిలెట్‌కని లేచి బయటకు వచ్చి, లోపలికి వెళ్లేసరికే హెల్మెట్‌ పెట్టుకున్న వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపి పరారైనట్లు రవళి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు విచారణలో అసలు విషయం తేలింది.

భర్తను చంపేందుకు కరెంట్ షాక్, ఆక్సిడెంట్ చేయించింది

భర్తను చంపేందుకు కరెంట్ షాక్, ఆక్సిడెంట్ చేయించింది


అంతకుముందు కూడా భర్తను హతమార్చేందుకు రవళి రెండుసార్లు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఇంటిగేటుకు విద్యుత్తు తీగను కలిపి పెట్టిందని తెలిపారు. ఆ సమయంలో అక్కడకు మరో వ్యక్తి రాగా చిన్న షాక్‌తో బయటపడ్డాడు. ఇటీవల ఓ కారు ఢీకొట్టడంతో రాజేందర్‌ గాయపడ్డాడు. దీని వెనకా భార్య కుట్ర ఉందంటున్నారు. హత్యకు గురైన రాజేందర్‌ ఇంటిని పెద్దపల్లి ఇం‌ఛార్జి డీసీపీ రూపేశ్‌ పరిశీలించారు. రెండు తూటాలను, నిందితుడి హెల్మెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలో భాగస్వాములైన చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకొని విచారిస్తున్నట్లు సమాచారం. రవళిని కూడా అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

భర్తను హత్య చేసి భార్య జైలుకు.. అనాథలుగా మిగిలిన పిల్లలు

భర్తను హత్య చేసి భార్య జైలుకు.. అనాథలుగా మిగిలిన పిల్లలు


తన కోడలు రవళి.. సన్నిహితుడు బందం రాజు, సయ్యద్‌తో కలిసి హత్య చేయించిందని మృతుడి తండ్రి మొండయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కిష్టంపేటకు చెందిన రాజు అక్కడ మద్యం బెల్టు దుకాణం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు హత్యకు వినియోగించిన తుపాకీ బీహార్‌ నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా, నిందితులకు ఇంకా ఏదైనా నేర చరిత్ర ఉందా? అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు తల్లి జైలుపాలు కావడంతో అనాథలుగా మిగిలిపోయారు వారి ఆరు, ఏడాదిన్నర వయస్సున్న పిల్లలు.

English summary
A woman killed her husband with help of paramour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X