కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కాలంలో కష్టం: ఆ 14 రోజులు ఇబ్బందులు.. కోలుకున్న వెంటనే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ ఇంపాక్ట్ కాస్త తక్కువే.. కానీ సెకండ్ వేవ్ మాత్రం ప్రభావం మాములుగా లేదు. వైరస్ సోకి.. కొద్దీరోజులకే జనం చనిపోయారు. ఇప్పుడు వాతావరణం మారుతున్నందున కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. అయితే గత నెలలో కరోనా వైరస్ బారిన పడ్డాను. ఏప్రిల్ 18వ తేదీన ఇన్‌ఫెక్ట్ కాగా.. 21వ తేదీన టెస్ట్ చేయడంతో కన్ఫామ్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. 19వ తేదీ సోమవారం నుంచి కరోనా మందులు వాడటంతో.. ఆరోగ్యం సహకరించింది.

శ్రీరామ నవవి రోజునే..

శ్రీరామ నవవి రోజునే..


మంగళవారం కిట్లు లేకపోవడంతో.. టెస్ట్ బుధవారం 21వ తేదీ శ్రీరామ నవమి రోజున జరిగింది. పాజిటివ్ రావడంతో ఒక్కటే ఆందోళన.. కానీ ధైర్యంగా ముందుకు సాగాను. అప్పటికే సపరేట్ రూములో ఉన్నాను. భార్య, పిల్లలు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. గురువారం భార్య, పిల్లలకు పరీక్ష చేయగా.. నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాను. తల్లిదండ్రులు వృద్దులు కావడంతో.. ఇబ్బంది అవుతుందని ఒక్కడినే బైక్‌పై అత్తగారింటికి వెళ్లాను. అక్కడే 14 రోజులు ఉండి.. మందులు వాడి, పూర్తిగా కోలుకున్నాను.

అమ్మకు కరోనా.. అంతకుముందు పక్షవాతం..

అమ్మకు కరోనా.. అంతకుముందు పక్షవాతం..


విధి విచిత్రమో ఏమో కానీ.. తర్వాత 10 రోజులకు అమ్మ, వదిన, అన్న కూతురు పాజిటివ్ వచ్చింది. మే 5వ తేదీన పరీక్ష చేసుకోగా.. నెగిటివ్ వచ్చింది. వెంటనే జగిత్యాల నుంచి స్వగ్రామం వేంపెట చేరుకున్నాను. కానీ ఆ రోజు అన్నకు పాజిటివ్ రాగా.. ఆ రాత్రి అమ్మ ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. దీంతో కరీంనగర్ తీసుకోవాల్సి వచ్చింది. కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాము. ఇప్పటికీ లంగ్స్‌లో ఇన్ ఫెక్షన్ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ అందరికీ నెగటివ్ వచ్చింది. అమ్మ పూర్తిగా కోలుకోవాల్సి ఉంది.

పిల్లలకు దూరంగా..

పిల్లలకు దూరంగా..


ఆ 14 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. పిల్లలు ఆ వైపు బాల్కనీలో ఉంటే.. ఇక్కడి నుంచి ఆనందించాను. ఆవిరి పట్టి, వ్యాయమాం చేశాను. కానీ 14 రోజుల వరకు ఇబ్బంది పడ్డాను. తొలుత కాళ్ల నొప్పి.. తలనొప్పి.. అవీ క్రమంగా తగ్గాయి. తర్వాత దగ్గు రావడంతో.. ల్యూపిటాస్ అనే సిరప్ వాడాను. కానీ తలనొప్పి రావడంతో భయపడ్డా.. అదీ మానేసి దాల్చన చెక్క, లవంగ, యాలకులుతోపాటు టాస్క్ ఎక్స్ సిరప్ వాడా. అయినప్పటికీ కఫ్ నన్ను నీడలా వెంటాడింది. కొద్దీరోజులు వాసన, టెస్ట్ కూడా రాలేదు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతో కరోనాను జయించాను. మే 5వ తేదీన పరీక్ష చేసి.. నెగిటివ్ రావడంతో నా ఆనందానికి అవధి లేకుండా పోయింది. కానీ మా అమ్మ ఆరోగ్యం క్షీణించడంతో డీలా పడిపోయాను. కానీ నాకు మాత్రం ఓ షాపు యజమాని, స్నేహితుడి ద్వారా కరోనా వచ్చిందని ఇవాళే తెలిసింది. ఇన్నిరోజుల నా ప్రశ్నకు సమాధానం లభించింది.

English summary
facing difficulties in the coronavirus infected time. april month i was infected with the close aide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X