కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటేయకుంటే పెన్షన్ ఆపేస్తారట.. ఎస్ఈసీకి ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ బై పోల్.. చలిలో కూడా హీటెక్కిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోపణలు కూడా ఎక్కువ వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకపోతే వికలాంగుల పింఛన్లు తొలగిస్తామనే కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని టీ పీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్‌ ముత్తినేని వీరయ్య వర్మ తెలిపారు. ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో జరిగిన వికలాంగుల సమావేశంలో టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకుంటే పింఛన్లు కట్‌ చేస్తామని వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి చెప్పారని వివరించారు.

ప్రలోభాల పర్వం

ప్రలోభాల పర్వం

ఓటర్లను ప్రలోభపెట్టడంతోపాటు వికలాంగులను భయభ్రాంతులకు గురిచేసేలా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, డీజీపీలకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశామని ఒక ప్రకటనలో వెల్లడించారు. వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకుని వికలాంగ ఓటర్లకు మనోధైర్యం కల్పించాలని ముత్తినేని వీరయ్య వర్మ కోరారు.

పదవీ నుంచి తొలగించాలి

పదవీ నుంచి తొలగించాలి

టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయకుంటే పింఛన్లు కట్‌ చేస్తామన్న వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో వికలాంగులతో సమావేశమై టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని హెచ్చరిస్తూ.. ఓటు వేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని బెదిరించడం మంచి పద్దతి కాదన్నారు. వాసుదేవరెడ్డి తక్షణమే వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వికలాంగులపై బెదిరింపులకు పాల్పడిన వాసుదేవరెడ్డిపై వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

 గెలుపు గుర్రాలు

గెలుపు గుర్రాలు

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

Recommended Video

PM CARES For Children: Free Education,Rs 10 Lakh Fund | Family Pension, Insurance || Oneindia Telugu
 బ్రేక్.. బ్రేక్

బ్రేక్.. బ్రేక్

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.

English summary
if u not vote, pension will be remove trs leaders are threatening to people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X