మహానంది ఆలయంపై డ్రోన్ కలకలం.. ఆలయ సిబ్బందికి టెన్షన్; అసలేం జరిగిందంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల పై డ్రోన్ల సంచారం కలకలం గా మారింది. గతంలో శ్రీశైలం ఆలయం పై డ్రోన్ కెమెరాలు సంచరించడం ఆందోళనకు గురి చేయగా, ప్రస్తుతం మహానంది ఆలయం పై డ్రోన్ల సంచారం ఆలయ అధికారులకు ఆందోళన కలిగిస్తుంది.

గతంలో శ్రీశైలం ఆలయంపై డ్రోన్ల సంచారం

గతంలో శ్రీశైలం ఆలయంపై డ్రోన్ల సంచారం

గతంలో నాలుగు రోజులపాటు రాత్రి సమయాల్లో శ్రీశైలం శైవక్షేత్రం పై డ్రోన్ కెమెరాలు సంచరించడం ఏపీలో చర్చనీయాంశమైంది. నాలుగు రోజులు శ్రీశైలం ఆలయం చుట్టూ తిరిగినడ్రోన్లుఆలయ అధికారులను టెన్షన్ పెట్టాయి. దీనికి సంబంధించిఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలోశ్రీశైలం పుణ్యక్షేత్రానికిప్రమాదం పొంచి ఉందని శ్రీశైలంను 'నో ఫ్లై' జోన్‌గా ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేసింది.

శ్రీశైలం ఆలయంపై డ్రోన్లు తిరగటంతో నల్లమల అటవీ ప్రాంతంలో పెంచిన నిఘా

శ్రీశైలం ఆలయంపై డ్రోన్లు తిరగటంతో నల్లమల అటవీ ప్రాంతంలో పెంచిన నిఘా

అప్పుడు శ్రీశైలం ఆలయ సమీపంలో డ్రోన్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్వార్టర్స్,ఔటర్ రింగ్ రోడ్, మల్లమ్మ కన్నీరు, ఉత్తరా పార్క్, విశ్వామిత్ర మఠం, రిజర్వాయర్ మరియు కొన్ని ఇతర సైట్లను చిత్రీకరించాయని ఆలయ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆలయం ,ఇతర ప్రదేశాల చిత్రాలను తీయడానికి దాదాపు మూడు డ్రోన్లు అనేకసార్లు తిరిగినట్టు గుర్తించారు. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో నిఘా పెంచారు.

 మహానంది ఆలయంపైనా డ్రోన్ సంచారం .. అగంతకుడిని పట్టుకునే యత్నం

మహానంది ఆలయంపైనా డ్రోన్ సంచారం .. అగంతకుడిని పట్టుకునే యత్నం

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహానంది ఆలయం పైన కూడా డ్రోన్ తిరగడం, ఏరియల్ వ్యూ చిత్రీకరించడం కలకలం గా మారింది. మహానంది ఆలయం పై డ్రోన్ సంచరించడం గుర్తించిన ఆలయ అధికారులు, డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నం చేశారు. అతను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పటికే పరిస్థితిని గుర్తించిన సదరు అగంతకుడు కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతన్ని పట్టుకోవడానికి ఆలయ సిబ్బంది దాదాపు ఆరు కిలోమీటర్ల మేర అతనిని వెంబడించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

రంగంలోకి పోలీసులు ..డ్రోన్ సంచారం పై అనుమానాలు

రంగంలోకి పోలీసులు ..డ్రోన్ సంచారం పై అనుమానాలు


డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తి పారిపోవడంతో, ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ లో పరిశీలించారు. అయితే సిసి టివి ఫుటేజ్ లో దృశ్యాలు క్లారిటీగా లేకపోవడం, కారు నెంబరు కనిపించకపోవడంతో అతడిని పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. ఎవరైనా సినిమా కోసం డ్రోన్ ఏరియల్ వ్యూ చిత్రీకరించారా? లేదా మరేదైనా అసాంఘిక కార్యకలాపాలకు ప్లాన్ చేయడం కోసం డ్రోన్ తో ఏరియల్ వ్యూను చిత్రీకరించారా? అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+