Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్నూలుకు హెచ్‌ఆర్సీ: న్యాయ రాజధాని దిశగా జగన్ సర్కార్: ఆగస్టు 15 నాటికి..!

కర్నూలు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రెండేళ్లు దాటిపోతోన్నాయి. అయినప్పటికీ- ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదు. అమరావతి ప్రాంతం నుంచి సచివాలయాన్ని తరలించాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమాలు.. తెలుగుదేశం పార్టీ ఆందోళనలు మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత అడ్డంకిని కల్పించాయి.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కూడా మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత ఆటంకాన్ని కలిగించింది. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ఈ ఏడాది పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది జగన్ సర్కార్.

హైదరాబాద్ టు కర్నూలు

హైదరాబాద్ టు కర్నూలు

రాష్ట్ర విభజన అనంతరం- హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఆవిర్భవించింది. 2024 వరకు హైదరాబాద్.. ఏపీ-తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇప్పటికీ ఏపీకి సంబంధించిన కొన్ని కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అందులో ఒకటి- ఏపీ మానవ హక్కుల కమిషన్. తెలంగాణ హెచ్ఆర్సీ ఉన్న భవనంలోనే దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.

న్యాయ రాజధాని దిశగా..

న్యాయ రాజధాని దిశగా..

విభజన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ హయాంలో హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలి వచ్చిన కార్యాలయాన్నీ అమరావతి ప్రాంతంలోనే ఏర్పాటయ్యాయి. ఆయా శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాన్నీ విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని అద్దె భవనాల్లో కొనసాగుతోన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన తరువాత..దానికి అనుగుణంగా కార్యాలయాలను తరలించనుంది ప్రభుత్వం.

న్యాయ రాజధానిలోనే హెచ్‌ఆర్సీ

న్యాయ రాజధానిలోనే హెచ్‌ఆర్సీ

మానవ హక్కుల కమిషన్ జ్యుడీషియల్ పరిధిలోకి ఉన్నందున.. దాన్ని న్యాయ రాజధాని కర్నూలుకు తరలించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కర్నూలులో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనంలో దీన్ని ఏర్పాటు చేయవచ్చని సమాచారం. దీనికోసం కొన్ని భవనాలను జిల్లా అధికార యంత్రాంగం ఎంపిక చేసి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తోంది. భవనం ఎంపిక పూర్తి కాగానే..వచ్చే మూడు, నాలుగు వారాల్లోగా ఏపీహెచ్ఆర్సీ కార్యాలయం హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి దీని ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని అంటున్నారు.

Recommended Video

    AP High Court: కర్నూలులో హైకోర్టు కట్టాల్సిందే... ఇది BJP డిమాండ్: Somu Veerraju
    ఇక విశాఖకు ఎప్పుడు?

    ఇక విశాఖకు ఎప్పుడు?

    అటు పరిపాలన రాజధాని, ఇటు న్యాయ రాజధానిలో ఒకేసారి కార్యకలాపాలను సాగించాల ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మూడు రాజధానుల్లో పరిపాలన సాగించేలా ఏర్పాట్లు చేస్తోన్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పంద్రాగస్టు వేడుకలు విజయవాడలోనే ఏర్పాటయ్యాయి. ఈ సారి దీనికి భిన్నంగా విశాఖపట్నంలో నిర్వహించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+