హమాలీ పని ఉపాధి కాదా..? కొలువులుపై నిరంజన్ రెడ్డి హాట్ కామెంట్స్
రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న కొలువులు పూర్తి చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. చదువుకున్న ప్రతీ ఒక్కరికీ సర్కారీ కొలువులు ఇవ్వడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. నాగర్ కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుకున్నోళ్లు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల పని ఉపాధి కాదా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో హమాలీ పనికంటే మించిన ఉపాధి ఏముందని అన్నారు. కామన్ సెన్స్ లేకుండా.. కొంతమంది కొలువులు ఇవ్వట్లేదని విమర్శలు చేస్తున్నారని, పక్క రాష్ట్రంలో ఉండేవారు.. అక్కడ అసలు ఉపాధే ఇవ్వకున్నా.. ఇక్కడకు వచ్చి కొట్లాడుతాం అంటున్నారు అంటూ పరోక్షంగా కామెంట్లు చేశారు. అలాగే, కేంద్రంలో కొలువులు భర్తీ చేయని కేంద్రప్రభుత్వం.. రాష్ట్రంలో మాత్రం కొలువులు గురించి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.

రాజకీయ లబ్ధి కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించి మొసలి కన్నీరు కారుస్తున్నారని విరుచుకుపడ్డారు. యువతను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్ దుమారం రేపే ఛాన్స్ ఉంది. హమాలీ పని ఉపాధి కాదా అని కామెంట్ చేయడం సరికాదు.. ఎందుకుంటే విద్యావంతులను.. అలాగే హమాలీలను అవమానించినట్టే అవుతుంది. దీనిపై విపక్షాలు ఫైర్ అయ్యే అవకాశం ఉంది.