ఆమెకు 17.. అతనికి 42, బెడిసిన ఘాటు ప్రేమ.. సూసైడ్ అటెంప్ట్
ప్రేమ చిగురించటానికి హద్దులు లేవంటారు. సాహిత్యపరంగా బాగానే ఉంటుంది. నాగరిక సమాజంలో కాస్త కష్టమే.. కానీ కొందరు మరచిపోతున్నారు. ప్రేమకు కులం, మతం కాదు.. వయసు కూడా అడ్డు కాదని చెబుతున్నారు. వావి, వరస, కాదు వయస్సు కూడా మరచిపోతున్నారు. తమ కన్నా 25 ఏళ్ల చిన్న వయస్సు గల బాలికతో ప్రేమాయణం సాగించాడు ప్రబుద్దుడు.. ఆమె మైనర్ కావడం విశేషం. ఈ ఘటన నెల్లూరులో జరిగింది.

లాడ్జీలో..
నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో గల ఓ లాడ్జిలో ఇద్దరు బుధవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఏంటీ అని ఆరా తీస్తే వారి ప్రేమ సంగతి తెలిసింది. రామయ్య (42).. 17 ఏళ్ల బాలిక లాడ్జిలో విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇది గమనించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాలిక పరిస్ధితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామయ్యను బుచ్చిరెడ్డి పాలెంలోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్ బాలిక
బాలిక మైనర్ కావడం విశేషం.. ఆమెకు రామయ్య మాయమాటలు చెప్పి లోబరచుకొని ఉంటాడు. ఆమె అతనిని పూర్తిగా నమ్మేసింది. పెళ్లికి ఒప్పుకోలేదో.. లేదో మరో సమస్యనో తెలియదు కానీ.. ఇద్దరు కలిసి సూసైడ్ అటెంప్ట్ చేశారు. రామయ్యకు గత చరిత్ర తెలియరాలేదు. అతనికి వివాహం జరిగిందా..? లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. కానీ బాలికను మాత్రం నయవంచన చేశాడు. ఆమె అతనిని పూర్తిగా విశ్వసించింది.

వయసు పట్టింపులు లేవు
నాగరిక సమాజంలో కూడా వయసు పట్టింపులు లేవు. తన తండ్రి వయస్సు ఉన్న ఒకరితో యువతి కలిసి ఉంది. అంతేకాదు.. అతనితో జీవితం పంచుకోవాలని అనుకొంది. కలిసి బతకలేమని భావించి.. చనిపోదామని అనుకున్నారు. కానీ ఇద్దరూ కలిసి దొరికిపోయారు. వారి ఘాటు ప్రేమ ప్రపంచానికి తెలిసింది. ముదురు ప్రేమ బయటపడింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications