ఓరేయ్.. ఎందిరా ఇదీ, బస్సు వెనకాల నిచ్చెన పట్టుకొని జర్నీ.. ఏకంగా 5 కి.మీ
కొందరు కొంటె కుర్రాళ్ల తీరు మారడం లేదు. ఒక్కొక్కరు వెకిలి చేష్టలు చేస్తూనే ఉన్నారు. ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టు ఘటన జరిగిన తర్వాత.. అయ్యో అంటున్నారు. కొందరు చేసే పని మిగతా వారికి కూడా ఇబ్బంది కలిగిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.

నిచ్చెన పట్టుకొని మరీ..
ఓ
విద్యార్థి
ఆర్టీసీ
బస్సు
వెనకాల
నిచ్చెన
పట్టుకుని
ప్రయాణించాడు.
ఆ
ఫోటో,
వీడియోలు
సోషల్
మీడియాలో
షేర్
చేశారు.
మనుబోలు
నుంచి
ఆదిశంకర
ఇంజనీరింగ్
కాలేజీ
వరకు
వేలాడుతూనే
ఉన్నాడు.
అంటే
5
కిలోమీటర్లు
నిచ్చెనపట్టుకుని
విద్యార్థి
ప్రయాణించాడు.
అసలే
వేసవి..
ఆ
పై
భానుడి
ప్రతాపం
ఈ
సమయంలో
ఇలా
చేయడం
అంటే
సాహసమే..
అతనికి
ఏమీ
కాలేదు..
పడిపోయి
ఉంటే..ఎవరూ
బాధ్యులు
అనే
ప్రశ్న
వస్తోంది.

తెలియదే..?
ఘటనపై
సమాచారం
లేదని
ఆర్టీసీ
అధికారులు
చెబుతురు.
ఆకతాయిల
పనేనని
చెప్పి
తప్పించుకునే
ప్రయత్నం
చేస్తున్నారు.
బస్సు
ఆపకపోవడంతో
విద్యార్థి
అలా
వెళాడాడు
అని
విద్యార్థి
సంఘాలు
అంటున్నాయి.
అతనిని
కవర్
చేసే
ప్రయత్నం
చేస్తున్నారు.
విషయం
పోలీసులు,
కాలేజీ
యాజమాన్యం
దృష్టికి
వెళ్లింది.
పోలీసులు
ఆరా
తీస్తున్నట్లు
తెలుస్తోంది.
కొంతమంది
విద్యార్థులు
ఆకతాయి
పనులు
చేస్తూ
ప్రమాదంలో
పడుతున్నారని
పలువురు
అంటున్నారు.
కొంటే
పనులు
చేస్తూ
ప్రాణాలు
మీదకి
తెచ్చుకుంటున్నారని
చెబుతున్నారు.

మిగతా వారు లేరా..?
అవును..
పిచ్చి
పనులు
చేసే
మిగతా
వారిని
కూడా
చెడగొడుతున్నారు.
నిచ్చెన
పట్టుకొని
వెళ్లడం
ఏంటీ
అనే
ప్రశ్న
వస్తోంది.
మరీ
ఆ
బస్సులో
మిగతా
వారు
లేరా..?
వారు
ఎందుకు
బస్సును
ఆపలేదు
అని
అడిగారు.
అప్పుడే
ఆపి..
నాలుగు
తిడితే
పరిస్థితి
వేరేలా
ఉండేదని
అంటున్నారు.
కండక్టర్
ఏం
చేస్తున్నారని..
బస్సులో
మిగతా
పెద్దలు
ఎవరూ
లేరా
అనే
ప్రశ్న
వస్తోంది.
వారు
కూడా
చెబితే
బాగుండేదని
కొందరు
అంటున్నారు.
మొత్తానికి
ఓ
విద్యార్థి
5
కిలోమీటర్ల
మేర
ప్రయాణించాడు.