సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుబ్బాక పోరు .. హరీష్ వర్సెస్ ఉత్తమ్... గెలుపుపై ధీమాలు... పేలుతున్న మాటల తూటాలు

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. ఒకపక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుండటం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది.

నిజామాబాద్ లో సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు .. కేసీఆర్ పై ఫైర్ అయిన ఉత్తమ్, రేవంత్ నిజామాబాద్ లో సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు .. కేసీఆర్ పై ఫైర్ అయిన ఉత్తమ్, రేవంత్

దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ తోనే ఉన్నారన్న మంత్రి హరీష్ రావు

దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ తోనే ఉన్నారన్న మంత్రి హరీష్ రావు

దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది . అధికార టీఆర్ఎస్ దుబ్బాకలో ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని, గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసారి ఎలాగైనా దుబ్బాకలో హస్తం హవా కొనసాగుతుందని, విజయం మాదే అంటూ ప్రకటనలు చేస్తున్నారు.
దుబ్బాక లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అయ్యిందని, దుబ్బాక ప్రజలు 99% టిఆర్ఎస్ తోనే ఉన్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ కాంగ్రెస్ నాయకులకు ప్రశ్న

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ కాంగ్రెస్ నాయకులకు ప్రశ్న

గతంలో దుబ్బాక కు ఎప్పుడూ రాని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఖద్దరు అంగీలు వేసుకుని మరీ వస్తున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గతంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క ఇంటికి తాగునీరు కూడా అందించలేదని , ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. రైతు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం అండగా కూడా లేని కాంగ్రెస్ పార్టీకి ఎలా ఓటేయమని అడుగుతున్నారు అంటూ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగేందుకు సిగ్గు ఉండాలి అని వ్యాఖ్యానించారు. ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓటు వేయమని అడుగుతుందని ప్రశ్నించారు హరీష్ రావు.

 అభివృద్ధి కాదు .. నన్ను చూసి ఓటేయ్యమని హరీష్ అడుగుతున్నారని ఎద్దేవా చేసిన ఉత్తమ్

అభివృద్ధి కాదు .. నన్ను చూసి ఓటేయ్యమని హరీష్ అడుగుతున్నారని ఎద్దేవా చేసిన ఉత్తమ్

ఇక ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. టిఆర్ఎస్ పాలనలో దుబ్బాక లో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని ఆయన మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు అభివృద్ధిని చూసి కాదు నన్ను చూసి ఓటేయండి అని అడగడం అందుకు నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.అన్ని వర్గాల ప్రజలను కెసిఆర్ మోసం చేశారని, కెసిఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజలు ఈ ఎన్నికల్లో నైనా కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Recommended Video

Nizamabad Local Body MLC Elections: TPCC President Uttam Kumar Reddy Slams CM KCR
దుబ్బాకలో విజయం కాంగ్రెస్ దే అంటూ ధీమా

దుబ్బాకలో విజయం కాంగ్రెస్ దే అంటూ ధీమా

మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి . దళితుడిని సిఎం చేస్తానన్న కెసిఆర్ మాదిగ వర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. మూడు ఎకరాల భూమిని ఎంతమందికి ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయడమే కెసిఆర్ పని అని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక ప్రజలు ఈసారి సీఎం కేసీఆర్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

English summary
The Dubbaka by-election has now become ambitious for all political parties. the ruling TRS and the Congress party leaders are confident on their victory in Dubbaka. Minister Harish Rao said that the TRS victory in Dubbak was confirmed and that 99% of the people of Dubbaka were with the TRS. Uttam Kumar Reddy says victory is for the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X