"16 నెలల్లో అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్"
16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ ను మార్చాలని ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువులకోసం కొడంగల్ కు వెళ్లాలి అనేలా కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కొడంగల్ బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
"ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే ఆ రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధి ఉంటుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బ్రతికేలా ఉండాలని ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రతీ పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్నబియ్యం పంపిణీ చేపట్టాం. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. అదానీ అంబానీలతో పోతే పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణ మహిళలకు అప్పగించాం. మహిళలకు ఆర్ధిక స్వాతంత్ర్యం కల్పించాం" సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
"హైటెక్ సిటీ శిల్పారామంలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాం. ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముకునేందుకు అమెజాన్ తో సంప్రదింపులు జరుపుతున్నాం. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదువు అందించడం ఒక్కటే మార్గం. మీ పిల్లలు గొప్పగా చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుంది. అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం. ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమం తీసుకున్నాం.బిడ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లుగా... మా ప్రభుత్వం ఆలోచించి వారి ఆకలి తీరుస్తోంది" సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు, ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చాం. రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువులకోసం కొడంగల్ కు వెళ్లాలి అనేలా కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ ను మార్చాలని ప్రయత్నిస్తున్నాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు" అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

"మూడేళ్లల్లో ప్రాజెక్టు పూర్తి చేసి కొడంగల్ భూములు కృష్ణా జలాలతో తడుపుతాం. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ పారిశ్రామిక వాడగా తీర్చి దిద్దుతాం. త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూత వినబోతున్నారు. కొడంగల్ ప్రజల డెబ్బై ఏళ్ల కల నెరవేరబోతుంది. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు మొదలు కాబోతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోబోతున్నాం.అభివృద్ధిలో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తాం. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోండి.ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారె ఇందిరమ్మ చీరలు. అధికారులు ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాలి. పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా కొడంగల్ ను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలి. అభివృద్ధికి మా ఆడబిడ్డలు అండగా ఉండాలని కోరుతున్నా" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications