హైదరాబాద్ TO కోనసీమ అందాలు.. తక్కువ ధరకే.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ..
కోనసీమ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. పచ్చని ప్రకృతి మధ్య భూతల స్వర్గాన్ని తలపించేలా ఈ ప్రదేశం ఉంటుంది. గోదావరి నదీ అంచున పల్లెలు, కొబ్బరి తోటలు, పచ్చని పైర్లు, చూపుతిప్పుకోనివ్వని పర్యాటక ప్రాంతాలు.. ఇలా చాలానే ఉన్నాయి. ఉభయ గోదావరి మధ్యలో గోదావరి నది ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నుంచి వశిష్ఠ, గౌతమి నదులుగా విడిపోతుంది. ఈ రెండు పాయల మధ్యలో ఉన్న ప్రాంతాన్నే కోనసీమగా పిలుస్తారు. ఇక హైదరాబాద్ నగరవాసులకు కోనసీమ అందాలను చూడాలని అనిపిస్తుంటుంది. అలాంటి వారికోసం ఇండియన్ రైల్వేస్ కొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
పర్యాటకుల కోసం IRCTC ఎప్పటికప్పుడు కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తక్కువ ధరకే ఈ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా కోనసీమ అందాలను హైదరాబాద్ నగర ప్రజలు వీక్షించే విధంగా సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. గోదావరి టెంపుల్ టూర్ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ద్వారా గోదావరి జిల్లాల్లోని అందాలను, ఆలయాలను ఒకేసారి సందర్శించి మధురానుభూతిని పొందొచ్చు. IRCTC టూర్ ప్యాకేజీలో భాగంగా అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం లాంటి ప్రసిద్ధ ఆలయాలు దర్శించుకునే అవకాశం ఉంది.
ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ తేదీ 21, నవంబర్, 2025.. ఒకేవేళ ఈ తేదీ మీరు మిస్ అయితే, మరో తేదీలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి..3 రాత్రులు, 4 రోజులుగా ఉంటుంది. టూర్ లో భాగంగా మొదటిరోజు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి గౌతమి ఎక్స్ ప్రెస్ (12738) రాత్రి 8.30 గంటలకు రైలు స్టార్ట్ అవుతుంది. 9.00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఈ ప్రయాణం రాత్రంతా సాగుతుంది. రెండో రోజు ఉదయం 4 గంటల 30 నిమిషాలకు రాజమండ్రి స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడినుంచి సమీప హోటల్ కు వెళ్లాలి. అక్కడి నుంచి అన్నవరం ఆలయం దర్శనానికి వెళ్లొచ్చు.
ఆలయ దర్శనం తర్వాత గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రోజు రాత్రి బస రాజమండ్రిలోనే ఉంటుంది. మూడో రోజు.. కోనసీమ ఆలయాల్లో దర్శనం ఉంటుంది. అంతర్వేదిలోని నరసింహ స్వామి దర్శనం, బీచ్.. అక్కడి నుండి బాలాజీ టెంపుల్, అప్పన్నపల్లి, విఘ్నేశ్వరం టెంపుల్ సందర్శిస్తారు. సాయంత్రం ద్రాక్షారామం కూడా దర్శించుకున్నాక రాత్రి 8 గంటలకు రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఓవర్ నైట్ జర్నీ సాగుతుంది. రాత్రంతా జర్నీ తర్వాత నాలుగోరోజు ఉదయం 4.35 నిమిషాలకు సికింద్రాబాద్, ఆ తర్వాత అరగంటకు లింగంపల్లి చేరుకోవటంతో ఈ టూర్ ముగుస్తుంది.

ట్రైన్ టికెట్ ధరల విషయానికి వస్తే.. కంఫర్ట్ క్లాస్ లో.. సింగిల్ షేరింగ్ కు రూ. 15,340 గా ఉంది. అలాగే డబుల్ షేరింగ్ కు రూ. 8,940.. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7,170 గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications