హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళితులపై దాడి కాదు, అంతా ‘దొరలరాజ్యమే’: భరత్ రెడ్డి ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

దళితులపై దాడి ఘటన పై బీజేపీ నేత : అది 'షార్ట్ ఫిల్మ్‌', దాడి కాదు !

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో బీజేపీ నేత భరత్ రెడ్డి‌ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

దళిత యువకులపై తాను దాడి చేసిన మాట అవాస్తవమని అన్నారు. ఇందుకు సంబంధించి సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వీడియో దృశ్యాలన్నీ ఒక షార్ట్ ఫిల్మ్‌లో భాగంగా తీసినవేనని అన్నారు.

అభంగపట్నం దళితులపై దాడి: ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్ట్? అభంగపట్నం దళితులపై దాడి: ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్ట్?

అంతా దొరల రాజ్యమే..

అంతా దొరల రాజ్యమే..

‘షార్ట్ ఫిల్మ్ అయితే, ఘోరమైన పదజాలంతో వారిని ఎందుకు తిడతారు?' అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘మా చుట్టు పక్కల గ్రామాల్లో ఇప్పటికీ ‘దొరల రాజ్యం' ఉంది. ఆ గ్రామాల వాతావరణం యావత్తు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతో ఎటువంటి సెన్సార్ లేకుండా చిత్రీకరించా' అని భరత్ రెడ్డి అన్నారు. ‘ఆ షార్ట్ ఫిల్మ్ పేరేంటి?' అనే ప్రశ్నకు..‘దొరల రాజ్యం' అని భరత్ రెడ్డి సమాధానమిచ్చారు.

దళిత యువకులు ఇలా..

దళిత యువకులు ఇలా..

కాగా, భయం కారణంగా అలా చెప్పామని దళిత యువకులు నిజామాబాద్ వెళ్లిన తర్వాత అన్నారు గదా? అనే ప్రశ్నకు భరత్ రెడ్డి స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌లో మీడియా ముందు వారు మాట్లాడిన విషయం మీడియా ద్వారానే నాకు తెలిసింది. పోలీసు అధికారులకు ఓ వీడియో స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలుసు' అని భరత్ రెడ్డి అన్నారు.

వాస్తవం కాదంటూ..

వాస్తవం కాదంటూ..

‘మీ చెరలో ఉన్న దళిత యువకులను ఒక దగ్గర విడిచిపెట్టి పోలీసుల ఎదుట మీరు లొంగిపోయారట?' అనే ప్రశ్నించగా...‘ఇదంతా వాస్తవం కాదు' అని భరత్ రెడ్డి చెప్పారు.

నాకేం వ్యాపారాలు లేవు..

నాకేం వ్యాపారాలు లేవు..

తాను మొరం వ్యాపారం చేసే వ్యక్తిని కాదని, తనకు ఎలాంటి దందాలు, టిప్పర్లు లేవని, ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో వారికే ఉన్నాయని భరత్ రెడ్డి చెప్పారు. కాగా, దళితులపై దాడి చేసిన భరత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం భరత్ రెడ్డి హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు.

English summary
Bharath reddy responded on Monday on Dalith attack issue in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X