
మునుగోడులో కేసీఆర్ ను ఈ ప్రశ్నలు అడగండి.. మంత్రులను నిలదీయండి: ఓటర్లతో ఈటల రాజేందర్
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండుగనాడు కూడా ఎన్నికల ప్రచారానికి బ్రేక్ వేయకుండా ప్రచారం సాగించారు అన్ని పార్టీల నేతలు. ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్న ఈటల రాజేందర్ తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.
ట్విట్టర్ టిల్లు.. సమాధానం చెప్పు? చేనేత జీఎస్టీపై వీడియోతో కేటీఆర్ టార్గెట్గా బండి సంజయ్

కోమటిరెడ్డి రాజీనామా వెనుక కారణం ఇదే : ఈటల రాజేందర్
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు తండోపతండాలుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్న ఈటల రాజేందర్, ఓటు కోసం వస్తున్న టిఆర్ఎస్ మంత్రులను నిలదీయాలని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నిధులు రాక, అభివృద్ధి చేయలేకపోతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దగ్గర చెబితే, బ్రహ్మాస్త్రం ప్రయోగించమని తానే చెప్పానని, అందుకే ఆయన రాజీనామా చేశారని ఈటల రాజేందర్ వెల్లడించారు.

సీఎంను, మంత్రులను నిలదీయండి
గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో గువ్వల బాలరాజు ఎన్నికల ఇన్చార్జిగా వచ్చి, ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తానని చెప్పాడు. ఇక గెలిచిన తర్వాత వందల మంది ఫోన్ చేస్తే కూడా రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు. అటువంటి గువ్వల బాలరాజు ప్రస్తుతం మునుగోడులో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని, ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వచ్చారని అడగాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలి అన్నారు.

కేసీఆర్ వస్తే ఈ ప్రశ్నలు అడగండి: ఈటల రాజేందర్
డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నారని, అటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడకు వస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించాలన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ కే ముఖ్యమంత్రి నా అని నిలదీయాలి అన్నారు. దళిత బందు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించమన్నారు. మీ అంతరాత్మ సాక్షిగా అలోచన చేసుకోవాలని సూచించిన ఈటల రాజేందర్ ధర్మాన్ని కాపాడాలని పేర్కొన్నారు.

బంగారు తెలంగాణా అంటే ఇదేనా? తెలంగాణా ఎందులో నంబర్ వన్?
కెసిఆర్ ఇంట్లో నుండి డబ్బులు ఇస్తే.. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఎందుకు పెంచారు అని అడగాలన్నారు. తెలంగాణా నంబర్ వన్ అని చెప్తున్న కేసీఆర్ ను తెలంగాణా దేనిలో నంబర్ వన్ అనేది చెప్పాలన్నారు. తెలంగాణా తాగుడులో నంబర్ వన్ గా మారిందన్నారు. బంగారు తెలంగాణ అంటే భర్తలు లేని భార్యలా?బంగారు తెలంగాణ అంటే తల్లి లేని పిల్లలా ?బంగారు తెలంగాణ అంటే అప్పుల కుంపటా?అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఇవన్నీ పోవాలి అంటే కెసిఆర్ పాలన అంతం కావాలన్నారు.

వారిచ్చినవి తీసుకోండి.. కానీ బీజేపీకే ఓటెయ్యండి
రాజగోపాల్ రెడ్డి గెలిస్తే దెబ్బ తగిలేది కెసిఆర్ కే, దిమ్మ తిరిగేది కెసిఆర్ కే అని పేర్కొన్నారు. మన అవసరం కోసం పనిచేసేవాడు గొప్పనా?వారి అవసరం కోసం వచ్చేవాడు గొప్పనా ?అనేది అందరూ ఆలోచించాలని పేర్కొన్నారు. అతను దోపిడీదారుడన్నారు. తినండి, తాగండి, డబ్బులు ఇస్తే తీసుకోండి, వారిచ్చినవి అన్నీ తీసుకోండి కానీ బీజేపీని, ధర్మాన్ని గెలిపిస్తాం అని చెప్పాలన్నారు ఈటల రాజేందర్ .