వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా మంత్రుల మైండ్ డైవర్షన్.. కేసీఆర్ వ్యూహానికి చెక్ పెట్టటంలో బీజేపీ సక్సెస్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినా మంత్రులు ఆ పని చేయలేక పోతున్నారు. ప్రస్తుతం మంత్రులను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఐటీ, ఈడీ దాడులు వేధిస్తున్నాయి. ఎప్పుడూ ఎవరిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడిచేస్తాయి అన్నది అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉన్నారు. టి ఆర్ ఎస్ వర్సెస్ బిజెపి ఆడుతున్న గేమ్ లో, సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ కి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం లో మంత్రులు పావులుగా మారారు.

తెలంగాణా మంత్రులకు బీజేపీ మార్క్ షాక్

తెలంగాణా మంత్రులకు బీజేపీ మార్క్ షాక్


తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వెళతారని అంతా భావించారు. అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మూడో సారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని, ముందస్తు కి వెళ్లే ప్రసక్తే లేదని, ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉండాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించి ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గాలపై ఫోకస్ చేద్దాం అనుకున్న మంత్రులను బిజెపి షాక్ ఇచ్చింది. వారి మైండ్ డైవర్ట్ చేసింది.

మంత్రులపై దాడులు, కవిత పై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలతో టెన్షన్

మంత్రులపై దాడులు, కవిత పై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలతో టెన్షన్

తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర తదితరులపై ఈడీ, ఐటి దాడులతో ఒక్కసారిగా ఫోకస్ అంతా కేంద్ర దర్యాప్తు సంస్థ దాడుల మీదే ఉండేలా చేసింది. ఇక ప్రస్తుతం కెసిఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నారని వెలుగులోకి వచ్చిన అంశాలతో మంత్రులకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కవితను అరెస్ట్ చేసే దిశగా ప్రయత్నం జరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎవరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించటంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ అనవసరంగా బీజేపీతో తలనొప్పి పెట్టుకున్నాడని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నేతలు లోలోపల మధనపడు ఉన్నారని సమాచారం.

టీఆర్ఎస్ మంత్రుల మైండ్ డైవర్షన్ లో బీజేపీ సక్సెస్

టీఆర్ఎస్ మంత్రుల మైండ్ డైవర్షన్ లో బీజేపీ సక్సెస్

టిఆర్ఎస్ పార్టీలో ఆర్థికంగా బలోపేతంగా ఉన్న నాయకులు, తమపై ఎప్పుడు ఏం దాడులు జరుగుతాయో అన్న ఆందోళనలో వచ్చే ఎన్నికలు తర్వాత, ముందు తమ ఆస్తులను కాపాడుకోవటం ఎలా అన్న దానిపై దృష్టి పెడుతున్నారు. టిఆర్ఎస్ నాయకులకు మైండ్ డైవర్ట్ చేసేలా బిజెపి వ్యూహం ఫలించిందని తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది భావిస్తున్నారు. ఇక బీజేపీ ని ఇరకాటంలో పెట్టాలని టిఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నం చేస్తున్నా, అది అంత సక్సెస్ కావడం లేదని టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ కీలక నాయకులను అరెస్ట్ చెయ్యాలని భావించినా సిట్ అధికారులకు అది సాధ్యం కావటం లేదు. ఇక బీజేపీ నాయకులను ఇరికించటంలో టీఆర్ఎస్ ఫెయిల్ అవుతుంది.

బీజేపీని ఇరకాటంలో పెట్టటంలో టీఆర్ఎస్ ఫెయిల్..

బీజేపీని ఇరకాటంలో పెట్టటంలో టీఆర్ఎస్ ఫెయిల్..


బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలయత్నం చేసినా, కోర్టు అనుమతితో బండి సంజయ్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకొని, సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేస్తూ సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై పోరాటంలో ప్రతి పక్షాలు బలంగా ముందుకు వెళుతుంటే, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల విషయాన్ని మరిచిపోయి ఐటీ, ఈడీ దాడుల గొడవలో పడిపోయారు.

వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను తాలిబన్ అంటే గవర్నర్ తమిళిసై సమర్ధిస్తారా!!వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను తాలిబన్ అంటే గవర్నర్ తమిళిసై సమర్ధిస్తారా!!

English summary
It is said that BJP's game plan to divert the minds of Telangana ministers who wanted to focus on elections in Telangana was successful. As the raids by the central investigation agencies continue, tension is visible among the ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X