ఎమ్మెల్యేల కొనుగోలులో తెరవెనుక బీఎల్ సంతోష్, తుషార్, సునీల్ బన్సాల్ పేర్లు .. కొత్త చర్చ
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి వంద కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని బిజెపి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో ముగ్గురు స్వామీజీలతో చర్చలు జరిపినట్టు టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలు అవుతామన్న భయం తో టిఆర్ఎస్ ఆడుతున్న కొత్త డ్రామా అని బిజెపి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాదు ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తడిబట్టలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ముందు ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు.

ఆడియో లీకులతో ఆసక్తికర చర్చ ..తెరవెనుక బిజెపి కీలక నాయకులు
అయితే నిన్న విడుదలైన ఆడియో లీకులలో ఉన్న సమాచారాన్ని బట్టి, తెరవెనుక బిజెపి కి సంబంధించిన కీలక నాయకులు ఉన్నారు అన్న చర్చ జరుగుతుంది. బిజెపి చేసిన ఈ ఆపరేషన్ రాష్ట్ర నేతలకు తెలియకపోవచ్చు అని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. తెర వెనుక కథ నడిపించిన బిజెపి కీలక నేతల పేర్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రామచంద్ర భారతి ఆయనకు పంపించిన మెసేజ్ ఒకటి వెలుగుచూసింది.

సునీల్ బన్సాల్ కు రామచంద్ర భారతి మెసేజ్
తెలంగాణకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.. ఎక్కడికి రావాలి సమయం సూచించండి అంటూ సునీల్ కుమార్ బన్సాల్ కు రామచంద్ర భారతి ఎస్ఎంఎస్ పంపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ ను కూడా పోలీసులు పొందుపరిచినట్లు తెలుస్తోంది. సింహయాజులు, రామచంద్రభారతి, నంద కుమార్ మధ్య జరిగిన ఆడియోలో వారు మాట్లాడిన అంశాలను బట్టి తెలంగాణ బీజేపీ వాళ్ళకి డీల్ గురించి ఏమీ తెలియదు. మొత్తం ఢిల్లీ వాళ్లు మేనేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది అన్న చర్చ జరుగుతుంది.

మీటింగ్ రికార్డింగ్ ఉంటే టీఆర్ఎస్ దగ్గర పక్కా ఆధారాలున్నట్టే
జరిగిన ఆడియో సంభాషణల పొడగింపుగా రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో అందరూ కలుసుకున్నారు.అంటే ఆడియోలో ఉన్న మాటలన్ని మళ్లీ వాళ్లు కచ్చితంగా ఇంకా విపులంగా మాట్లాడి ఉంటారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక ఈ మీటింగు కెమెరా లో రికార్డు చేశారు అని వినిపిస్తున్న క్రమంలో సంభాషణలు ఫేక్ అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉండదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయేమో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

ఆడియో లీకులలో బీఎల్ సంతోష్, తుషార్ పేర్లు .. వారిని ఇరికిస్తారా?
నంద కుమార్ ఢిల్లీ లో బీఎల్ సంతోష్ అనే వ్యక్తిని కలిశారు.అంటే కేసులోకి సంతోష్ ని కూడా లాగవచ్చు అన్న టాక్ వినిపిస్తుంది. బి ఎల్ సంతోష్ అనే వ్యక్తి బిజెపిలో కీలకమైన వ్యక్తి కావడంతో, ఈ కేసులో ఆయనను లాగితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ సంభాషణలో తుషార్ అనే వ్యక్తి పేరు వచ్చింది.ఇతను మోడీ , అమిత్ షా కి చాలా దగ్గర మనిషి అని సంభాషణలో చాలా క్లియర్ గా మాట్లాడారు కాబట్టి ఎమ్మెల్యే లతో మాట్లాడే సమయంలో తుషార్ లైన్ లోకి వచ్చి మాట్లాడి ఏమైనా హామీ ఇస్తే,తనను ఈ కేసులోకి తీసుకుని వస్తారేమో? అన్న చర్చ కూడా సాగుతోంది

ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రభావం ఈ కేసుపై ఉంటుందా?
ఏది ఏమయినా ఈ ఎపిసోడ్ అంత ఈజీ గా ముగిసేలా లేదు. ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న నంద కుమార్ బిజెపి వదిలిన బాణమా.. లేకుంటే ఈ వ్యవహారంలో ఏం జరిగి ఉంటుంది అన్నది మాత్రం అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ఏది ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రభావం ఈ కేసు పై ఏమైనా ఉంటుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications