రేపే ఉపఎన్నిక: భారీ భద్రత, తొలి ఓటరుకు గులాబీతో స్వాగతం, కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి రేపు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు.
శనివారం వరంగల్ ఉపఎన్నికను దృష్ట్యా ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 20 కంపెనీల పోలీసు బలగాలను నియోజకవర్గాల్లో మోహరించారు. కాగా, ఈ లోక్‌సభ ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. మొత్తం ఓటర్లు 15,09,671. నియోజకవర్గంలో 1,778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.
శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుందన్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికి ఓటు వేసే అవకాశం ఇస్తామన్నారు. ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోను ఏర్పాటు చేశామన్నారు.

పోలింగ్ ప్రక్రియను 5 వందల మంది వీడియో గ్రాఫర్‌లతో చిత్రీకరిస్తున్నామని వెల్లడించారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే తొలి ఓటురకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికుతామన్నారు. కాగా, ఎలక్షన్ కమిషన్ కొత్తగా తొలి ఓటరుకు ఘన స్వాగతం పలికే పద్ధతిని ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ గురువారం మీడియాకు తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే మొదట ఓటు వేసేందుకు వస్తారో వారికి, అక్కడున్న ఎన్నికల సిబ్బందికి పుష్పగుచ్ఛం ఇచ్చి లోపలికి సాదరంగా ఆహ్వానిస్తారని చెప్పారు. అయితే ఈ నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. తొలి ఓటరుకు గులాబీ పూలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
వరంగల్ ఉపఎన్నిక బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి
వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ బందోబస్తుకు వచ్చిన ఎం.రాజు అనే పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వరంగల్ జిల్లాలోని రఘనాథపల్లిలో డ్యూటీ నిర్వహిస్తున్న అతనికి శుక్రవారం మూర్చలు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 48 ఏళ్ల రాజు స్వగ్రామం మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తఖడీం. 1993 బ్యాచ్‌కు చెందిన అతనికి కొంతకాలంగా మూర్చలు వస్తుండేవని మరో కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు. రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications