డ్రోన్ల ద్వారా దోమలకు చెక్.!వినూత్న కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం.!
హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంతో నగర ప్రజలకు దోమల బెడద నుండి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్యాన్ని అంధించి, తద్వారా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే విధంగా జిహెచ్ఎంసి ప్రత్యేక చొరవ కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగర పరిధిలోగల చెరువులు, కుంటలు, నీటి నిలువ ప్రదేశాలలో దోమలను నియంత్రించడానికి సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ దోమల యొక్క లార్వాలను నియంత్రించుటకు డ్రోన్లను వినియోగించడం జరుగుతోందని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

డ్రోన్లతో దోమల మందు పిచికారీ.. నూతన ప్రయోగమంటున్న జీహెచ్ఎంసీ అధికారులు..
చెరువులలో ఉండే గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు, దోమల పెరుగుదలకు ప్రధాన కారణాలైనా నీటితో నిండిన ప్రదేశాలు, వృక్షసంపద, సేంద్రియ వ్యర్ధాలు ఉన్న చెరువులలో మన్సోనియా, అర్మిజెరిస్, క్యూలెక్స్ వంటి ఇబ్బంది కలిగించే దోమలు చెరువులలో సామూహిక సంతానోత్పత్తికి దోహదపడుతాయి. లార్వా దశలోనే దోమలను నియంత్రించడానికి సమర్థవంతంగా దాడి చేయడం ప్రధానం. జిహెచ్ఎంసిలోని ఎంటమాలాజి శాఖ
ఫీల్డ్ వర్కర్ ల సహాయంతో చెరువులపై భౌతికంగా రసాయనాలను నేషనల్ వెక్టర్ బోర్న్ డీజీసెస్ కంట్రోల్, ఢిల్లీ వారిచే నిర్ణయంచబడిన మోతాదులో పిచికారి చేయడం జరుగుతోందని నగర పాలక సంస్ధ నిర్ధారిస్తోంది.

ఇక నగరంలో దోమలు మాయం.. వినూత్నంగా అడుగులేస్తున్న నగరపాలక సంస్థ
అయినప్పటికీ కొంత ప్రయోజనం జరగుతున్నప్పటికీ ఆశించిన లక్ష్యం చేరడానికి ఎక్కువ సమయం పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా గుర్రపు డెక్కను, పూర్తిగా తొలగించే అవకాశం లేకపోవడం, చెరువులలో కొన్ని ప్రాంతాలు పిచికారి చేయడానికి అనుకూలంగా లేక పోవడం, కొన్ని ప్రదేశాల్లో మాత్రమే రసాయనం పిచికారి చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ అంశాల కారణంగా చెరువుల నుండి దోమల బెడద సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని లక్ష్యాన్ని చేరేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తోంది.

నగరంలోని 30 చెరువుల్లో డ్రోన్ల ద్వారా మందు పిచికారీ.. దోమల నివారణకు బృహత్కర ప్రయోగం..
ఈ నేపథ్యంలో మురుగు నీరు ఎక్కువ నిలిచే చెరువులను మొదటి విడతగా ఎంపిక చేసి దోమల నివారణకు ప్రయోగాత్మకంగా డ్రోన్లను వినియోగించుకోవడం జరుగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగరంలో మొదటగా 30 చెరువులలో డ్రోన్ల ద్వారా దోమల నివారణకు వాడే రసాయనాన్ని పిచికారి చేయడం జరగుతుందని, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఒప్పందం చేసుకొని నెలకు రెండుసార్లు, అవసరమైనచోట మూడు సార్లు కూడా పిచికారి చేయడం వల్ల దోమల ఉత్పత్తిని అరికట్టొచ్చని అధికారులు చెప్పుకొస్తున్నారు.

డ్రోన్ల వల్ల ప్రయోజనాలు అనేకం.. ఇక సమర్ధవంతంగా దోమలకు చెక్..
డ్రోన్ల ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా ఎకరం చెరువును కేవలం 10 నిమిషాల్లో పిచికారి చేయవచ్చని తెలుస్తోంది. చెరువులోని అన్ని భాగాలకు సులువుగా చేరడం, చెరువు అంతటా ఏకరితీన పిచికారితో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో ఆరు జోన్లలో ఒక్కొక్క జోన్ కు ఒక్కటి చొప్పున మొత్తం 6, హెక్సకాప్టర్ డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 30 చెరువులకు ఒప్పందం చేసుకోగా మరో 20 చెరువులలో దోమల నివారణకు చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదించారు అధికారులు. దోమల సమస్య ఎక్కువగా ఉన్న చెరువులు, కుంటలు కాలనీలు, క్వారీలు, ఓపెన్ ప్లాట్లు, డంపింగ్ యార్డు, మూసినది పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ ల ద్వారా రసాయనాన్ని పిచికారి చేసి దోమల లార్వా, పెద్ద దోమల నియంత్రణ చేయడం జరుగుతుందని నగర పాలక సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్.. -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి -
ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త! -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
మీ ఏరియాలో కొత్త ఫ్లైఓవర్ వస్తుందా? జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ఇదే! -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..!












Click it and Unblock the Notifications