హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..!
ఉరుకులు పరుగుల జీవితం, కాంక్రీట్ లైఫ్ కు అలవాటు పడిన హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. వీకెండ్స్ లో అలా జాలీగా ట్రిప్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? ఇప్పటికే నగరంలోని పర్యటక ప్రాంతాలను కవర్ చేశారా..? అయితే ప్రస్తుతం నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ పార్క్ ను ఇప్పుడే సందర్శించండి.. మీరు లైఫ్ లో పొందని అనుభూతిని పొందుతారు. ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్లి ఈ అడ్వెంచర్ పార్క్ లో సాహసాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది.
హైదరాబాద్ అంటే చారిత్రక కోటలు, కట్టడాలు మాత్రమే కాదు ఇప్పుడు అడ్వెంచర్ పార్కులకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. బిజీలైఫ్ కు అలవాటు పడిన నగరవాసులకు వీకెండ్స్ లో గొప్ప రిలీఫ్ ఇచ్చేందుకు ఈ అడ్వెంచర్ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు నగరంలో క్లిఫ్ ఇన్ అడ్వెంచర్స్ పేరు బాగా వినిపిస్తోంది. దాదాపు 500 ఎకరాల్లో ఈ క్లిఫ్ ఇన్ అడ్వెంచర్ పార్కు ఉంటుంది. తుక్కుగూడలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 14,15 వద్ద ఈ అడ్వెంచర్ పార్కు ఉంది. సిటీ నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే ఈ పార్కు ఉంది.
ఇక్కడ జిప్ లైన్(తెలంగాణలోనే పొడవైన స్కై సైక్లింగ్, ఇంజాపూర్), రాపెల్లింగ్, వాల్ క్లైంబింగ్, కాయాకింగ్, పెడల్ బోటింగ్, జంగిల్ సైక్లింగ్, ఫారెస్ట్ ట్రెక్కింగ్, నేచర్ వాక్స్ తదితర అడ్వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే గేమ్స్ లో ఆర్చెరీ, వాలీబాల్, రోప్ కోర్సులు, కాంప్ ఫైర్ విత్ మ్యూజిక్, అవుట్ డోర్ స్క్రీనింగ్స్ అందుబాటులో ఉన్నాయి.

క్లిఫ్ ఇన్ అడ్వెంచర్ పార్కు ఫీజు వివరాలు చూస్తే రూ. 799 నుంచి ప్రారంభం అవుతుంది. టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. నైట్ కాంపింగ్ సమయాలు సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారు జామున ఉదయం 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు రూ. 1,700 నుంచి రూ. 1,999 గా ఉంటుంది. ఈ పార్కుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం Cliff-Inn Adventures అధికారిక వెబ్ సైట్ లేదా 95731 99863 నంబర్ కు సంప్రదించవచ్చు. ఇంకెందుకు మీరు కూడా క్లిఫ్ ఇన్ అడ్వెంచర్ పార్కులో సాహసం చేయండి..
-
తడోబా పులి.. కళ్లు చెదిరే రాజసం. చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
మూసీ తీరాన మహత్తరం -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
దేశంలో బెస్ట్ ట్రెక్కింగ్ స్పాట్స్ ఇవే.. లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందే..! -
సమ్మర్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే.. అస్సలు మిస్ అవ్వకండి..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications