• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ కు హైక‌మాండ్ షాక్‌-కేసీఆర్ వ్యూహంతో మ‌రోసారి -ఢిల్లీలో విందు రాజ‌కీయాలు..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో వేగంగా స‌మీక‌ర‌ణాలు మారి పోతున్నాయి. తెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ఎస్ అన్న‌ట్లుగా రాజ‌కీయం వేడెక్కుతుంటే..ఢిల్లీలో మాత్రం మ‌రో దారిలో రాజ‌కీయం క‌నిపిస్తోంది. బీజేపీ ని ఓడించ‌టం కోసం క‌లిసొచ్చే పార్టీల‌తో కాంగ్రెస్ మంత‌నాలు ముమ్మ‌రం చేసింది. అందులో భాగంగా.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ విందు ఇచ్చారు. 12 పార్టీల‌కు చెందిన నేత‌లు ఈ విందులో పాల్గొన్నారు.

కాంగ్రెస్ విందుకు గులాబీ నేత‌లు..

కాంగ్రెస్ విందుకు గులాబీ నేత‌లు..

బీజేపీని కేంద్రంలో గ‌ద్దె దించ‌టం ..అదే విధంగా రానున్న ఎన్నిక‌ల్లో యూపీలో బీజేపీ గెల‌వ‌కుండా వ్యూహం ఖ‌రారు చేయ‌ట‌మే ఈ విందు ఉద్ధేశం. ఇందులో కాంగ్రెస్ లో సంస్థాగ‌త మార్పులు తేవాల‌ని లేఖ రాసిన సంచ‌ల‌నానికి కార‌ణ‌మైన జీ-23 నేత‌ల్లో దాదాపు అంద‌రూ హాజ‌ర‌య్యారు. వీరితో పాటుగా కాంగ్రెస్ ముఖ్య నేత‌లు..అదే విధంగా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, శ‌ర‌ద్ ప‌వార్‌, అఖిలేష్ యాద‌వ్‌, సీతారాం ఏచూరి, డి రాజా, ఒమ‌ర్ అబ్దుల్లా, సంజ‌య్ రౌత్‌, ఓబ్రియ‌న్ తో స‌హా టీఆర్ఎస్, ఆప్‌, ఆర్ ఎల్ డీ వంటి పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌ట్లుగా రాజ‌కీయం న‌డుస్తోంది.

తెలంగాణ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం..

తెలంగాణ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం..

గులాబీ నేత‌లు అటు కాంగ్రెస్‌..ఇటు బీజేపీ నేత‌ల పైన అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీ సందర్భంలోనూ ఫైర్ అవుతున్నారు. అదే విధంగా ఈ రెండు పార్టీల నేత‌లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ స‌మ‌యంలో గులాబీ పార్టీ నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కు నాన్ కాంగ్రెస్ - నాన్ బీజేపీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది. స‌డ‌న్ గా బీజేపీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీలతో క‌లిసి విందుకు హాజ‌ర‌వ్వ‌టం కొత్త స‌మీక‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతోంది, ఈ స‌మావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు బీజేపీని ఓడించ‌ట‌యే త‌మ ఉద్దేశ‌మ‌నే విధంగా వ్య‌వ‌హరిస్తున్నాయి.

కేసీఆర్ వ్యూహం మారిందా..

కేసీఆర్ వ్యూహం మారిందా..

2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత జాతీయ స్థాయిలో థ‌ర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసారు. మ‌మ‌తా, న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, స్టాలిన్ వంటి వారిని క‌లిసారు. కానీ, ఆ త‌రువాత ఆ ఆలోచ‌న‌లు ముందుకు సాగ‌లేదు. బీజేపీ పూర్తి మెజార్టీతో రెండో సారి కేంద్రంలో అధికారంలోకి రావ‌టంతో కేసీఆర్ తిరిగి తెలంగాణ రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయ్యారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఇచ్చి తాము రాజ‌కీయంగా న‌ష్ట‌పోయామ‌నే భావ‌న‌లో ఉన్న కాంగ్రెస్ తిరిగి తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని- అధికారంలోకి రావాల‌ని భావిస్తోంది.

రేవంత్ కు షాక్ - పోరాటం ఎవ‌రి పైనా

రేవంత్ కు షాక్ - పోరాటం ఎవ‌రి పైనా

రేవంత‌రెడ్డికి టీపీసీసీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. రేవంత్ సైతం త‌న స‌హ‌జ ధోర‌ణిలో కేసీఆర్ పైన విరుచుకుప‌డుతున్నారు. కాంగ్రెస్ లో కొంద‌రు నేత‌లు స‌హ‌క‌రించ‌క‌పోయినా..క‌లుపుకు పోయే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2023 ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందంటూ కేడ‌ర్ లో ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు బీజేపీ ని ఓడించేందుకు..వ్య‌తిరేక పార్టీలు క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని..బ‌లోపేతం కావాల‌ని నిర్ణ‌యించాయి. ఈ స‌మావేశంలో టీఆర్ఎస్ పాల్గొన‌టం ఇప్పుడు కీల‌క చ‌ర్చ‌గా మారింది.

ప్ర‌ధానితో మంచి రిలేష‌న్స్ ఉన్నా..

ప్ర‌ధానితో మంచి రిలేష‌న్స్ ఉన్నా..

ప్ర‌ధాని మోదీతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తొలి నుంచి సత్సంబంధాలే కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీతో రాజ‌కీయంగా పోరాడుతున్నా.. కేంద్ర - రాష్ట్ర సంబంధాల విష‌యంలో మాత్రం తేడా రాకుండా చూస్తున్నారు. అదే విధంగా ప్ర‌ధాని సైతం అనేక సంద‌ర్భాల్లో కేసీఆర్ కు ప్రాధాన్య‌త ఇచ్చారు.
తెలంగాణ నిర్ణ‌యం స‌మ‌యంలో 2014 లో రాష్ట్ర ప్ర‌క‌ట‌న చేస్తే త‌న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాన‌ని కేసీఆర్ చెప్పిన‌ట్లుగా ప్ర‌చారం సాగింది. కానీ, దానికి విరుద్దంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను పూర్తిగా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

కాంగ్రెస్ తో క‌లుస్తారా - కొత్త వ్యూహం అమ‌లు చేస్తారా..

కాంగ్రెస్ తో క‌లుస్తారా - కొత్త వ్యూహం అమ‌లు చేస్తారా..

ఇక‌, 2023 ఎన్నిక‌ల నాటికి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చి ప‌దేళ్లు పూర్త‌వుతుంద‌ని..ఇప్ప‌టికే అధికార పార్టీ పైన వ్య‌తిరేక‌త ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.ఈ స‌మ‌యంలో గులాబీ పార్టీ పైన ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవాల‌ని రేవంత్ అండ్ కో ప్ర‌యత్నాలు మొద‌లు పెట్టింది. బీజేపీ సైతం గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే, జాతీయ స్థాయి రాజ‌కీయాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే కాంగ్రెస్ .. బీజేపీకి వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ కూట‌మితో నిలిస్తే.. ఖ‌చ్చితంగా తెలంగాణ‌లో దాని ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంటుంది.

ఢిల్లీ విందు రాజ‌కీయం.. తెలంగాణ‌లో ప్ర‌భావం

ఢిల్లీ విందు రాజ‌కీయం.. తెలంగాణ‌లో ప్ర‌భావం

అప్పుడు బీజేపీకి అవ‌కాశం ల‌భిస్తుంద‌నే అంచ‌నాలు వ్య‌క్తం అవుతున్నాయి. తెలంగాణ‌లో ఉన్న సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో బీజేపీతో గులాబీ పార్టీ క‌లిసే అవ‌కాశాలు లేవు. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం పైన కొద్ది కాలంగా టీఆర్ఎస్ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూట‌మికి మ‌ద్ద‌తుగా ఢిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ వేస్తున్న అడుగుల వెనుక భారీ వ్యూహ‌మే ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. దీని ద్వారా తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా ఉన్న కాంగ్రెస్ ను బ‌ల‌హీన‌ప‌ర్చ‌ట‌మే అస‌లు ఉద్దేశంగా ప్ర‌చారం సాగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో రేవంత్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు వృధాగా మారుతాయా అనే చ‌ర్చ సైతం మొద‌లైంది.

English summary
TRS strategically moving political steps in Delhi. TRS leaders attend congress and allied parties meeting dinner meeting to defeat bjp in coming elections. It may effect on Telangana politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X