ఆసక్తికరం: రేవంత్‌కి ఆలింగనంతో కాంగ్రెస్ నేతల స్వాగతం, టీడీపీకి దూరమేనా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు ఆలింగనాలతో స్వాగతం పలకడం గమనార్హం.

 ఆలింగనంతో స్వాగతం..

ఆలింగనంతో స్వాగతం..

కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ రెడ్డి వెల్‌కమ్ అంటూ రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అందరితో చేతులు కలుపుతూ అసెంబ్లీ లోనికి వెళ్లిపోయారు.

 బాబుతో భేటీ తర్వాత.. టీడీపీకి దూరమైనట్లే

బాబుతో భేటీ తర్వాత.. టీడీపీకి దూరమైనట్లే

ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాదాపు టీడీపీకి దూరమైనట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ వచ్చాక.. ఆయనను కలిసి తాజా పరిణామాలను రేవంత్ వివరించనున్నట్లు తెలిసింది. తనకు పార్టీలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబుకు చెప్పిన తర్వాతే.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని రేవంత్ వర్గం నేతలు చెబుతున్నారు.

 రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నా..

రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నా..

కాగా, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోదర రాజనర్సు, గీతారెడ్డి లాంటి నేతలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అంశంలో కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు పేర్కొంటున్నారు.

టీడీపీ ఆఫీసుకు వెళ్లినా.. ఆ కుర్చీలో కూర్చోలేదు..

టీడీపీ ఆఫీసుకు వెళ్లినా.. ఆ కుర్చీలో కూర్చోలేదు..

ఇది ఇలా ఉండగా, అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ సమయంలో జరుగుతున్న బీఏసీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. అలాగే టీడీఎల్పీ ఆఫీసుకు వెళ్లిన రేవంత్.. ఇంతకుముందు ఆయనకు కేటాయించిన కూర్చిలో కాకుండా మరో సీట్లో కూర్చోవడం గమనార్హం. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్ రావు, చీఫ్ విప్ కొప్పుల, జానా రెడ్డి, భట్టి విక్రమార్క, చిన్నా రెడ్డి, కిషన్ రెడ్డి, సండ్ర తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై అన్ని పార్టీల లీడర్లు ఈ సమావేశంలో చర్చించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leaders Shabbir Ali and Ponguleti Sudhakar Reddy and Sampath Reddy on Thursday welcomed to TDP MLA Revanth Reddy at Telangana Assembly.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి