ట్విస్ట్: 5 నెలల క్రితమే మంజులకు గర్భస్రావం, మృతశిశువుకు డిఎన్‌‌ఏ పరీక్షలు

Posted By:
Subscribe to Oneindia Telugu

నాగర్‌కర్నూల్: నిలోఫర్ కిడ్నాప్ కేసులో మరో కొత్త కోణం బయటికొచ్చింది. శిశువును కిడ్నాప్‌ చేసిన మంజుల అనే మహిళ శిశువు తనకే పుట్టినట్టు భర్త కుమార్‌ గౌడ్, అత్త, బంధువులను నమ్మించింది. మరోవైపు మృతశిశువుకు నాగర్‌కర్నూల్ జిల్లా బండోనిపల్లి వద్దే వైద్యులు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.

నిలోఫర్ ఆసుపత్రిలో శిశువును కిడ్నాప్ చేసిన మంజుల పథకం ప్రకారంగా వ్యవహరించింది. తనకు అబార్షన్ అయిన విషయం కూడ బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకొంది. 5 నెలల క్రితమే మంజులకు అబార్షన్ అయింది.

Doctors plans to DNA test for parents identification in Neilofar kidnap incident

బాబు పుట్టాడు అని భర్త కుమార్‌కు కిడ్నాప్‌ చేసిన రోజు ఫోన్ చేసి పేట్ల బురుజు ఆసుపత్రికి రప్పించింది. మంజుల మాటలను నమ్మి ఆసుపత్రికి వెళ్లి బాబుని తీసుకుని స్వగృహానికి కుమార్ గౌడ్ వచ్చాడు. సోమవారం ఉదయం బాబు చనిపోవడంతో తన బాబే చనిపోయినట్టు భావించి పూడ్చి పెట్టినట్లు పోలీసుల ఎదుట కుమార్‌ గౌడ్‌ చెప్పారు. తన భార్య మంజుల మోసం చేసిందని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు.

పూడ్చిన బాబును బయటకి తీశాక డీఎన్ఏ టెస్ట్ నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇరు కుటుంబాలు నాగర్‌ కర్నూలు జిల్లా బండోపల్లిలో చిన్నారిని పూడ్చిపెట్టిన స్థలానికి చేరుకున్నాయి. శిశువు సమాధి వద్ద కన్నతండ్రి భోరున విలపించడం అక్కడున్నవారిని కదిలిచింది. పోలీస్‌ బందోబస్తు నడుమ వైద్యుల బృందం శిశువు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New twist in Neilofar child kidnap case. Manjula, who kidnapped baby from Neilofar hospital.She was abortion 5 months back.Doctors completed postmortem to child dead body at Bandonipally in Nagarkurnool district on Wednesday. Doctor planning to DNA test for parents identification.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి