వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీవ్రవాది వికారుద్దీన్ కాల్చివేత: ఎవరీ డాక్టర్ హనీఫ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్ - నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో హతమైన వికారుద్దీన్‌కు ముషీరాబాదులో ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్న హనీఫ్ ఆర్థిక సాయం చేశాడు. ఈ ఎన్‌కౌంటర్లో హనీఫ్ కూడా మృతి చెందాడు. కాగా, గతంలో పోలీసులు హానీఫ్‌ను అరెస్టు చేశాక వికారుద్దీన్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీలోని దర్స్‌గా జిహాద్ ఒషహదత్ సంస్థలో వికారుద్దీన్ ఉన్నప్పుడు హనీఫ్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు లక్నోకు చెందిన ఇజార్ ఖాన్‌తో కలిసి మాట్లాడుకునేవారు. డీజేఎస్‌లో పని చేశారు.

ఆ తర్వాత వరుసకు తమ్ముడయ్యే అంజాద్ అలియాస్ సులేమన్, వారాసిగూడకు చెందిన మహ్మద్ జాకీర్, ఇజార్ ఖాన్, డాక్టర్ హనీఫ్‌లతో కలిసి ప్రణాళిక రూపొందించాడు. టీజీఐ పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు. హనీఫ్ డాక్టర్ ముసుగులో తన క్లినిక్‌ను టెర్రరిస్ట్ సానుభూతిపరుల డెన్‌ను ఏర్పాటు చేసుకున్నాడని పోలీసుల విచారణలోనే పట్టుబడ్డ అనుమానితులు చెప్పారు.

హనీఫ్ డాక్టర్ పేరుతో.. టెర్రరిస్ట్ సానుభూతిపరులకు ఆశ్రయం కల్పించాడని ఉగ్రవాద కేసులు దర్యాఫ్తు చేసే అధికారులు చెబుతున్నారు. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన హనీఫ్ నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్‌ను సంపాదించాడు. ఆ తర్వాత ముషీరాబాదులో క్లినిక్ ప్రారంభించి తీవ్రవాద సానుభూతిపరుల డెన్‌గా మార్చాడు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేవాడు.

2010 మే 14న పోలీసులను చంపాలనే కుట్రను హనీఫ్ క్లినిక్‌లోనే ప్లాన్ చేసినట్లు వికారుద్దీన్ పోలీసుల విచారణలో చెప్పాడు. హనీఫ్ వికారుద్దీన్‌కు ఆర్థిక సాయం చేసేవాడు. హనీఫ్‌తో దగ్గర సంబంధాలున్న వ్యక్తిని పోలీసులు చోరీ కేసులో విచారించగా హనీఫ్‌ సంగతి బయటపడింది. పోలీసులు హనీఫ్‌ను అదుపులోకి తీసుకోవడంతో వికారుద్దీన్‌ కార్యకలాపాలు బయటకు వచ్చాయి.

నా భర్త మృతదేహం ఇవ్వండి: హనీఫ్ తండ్రి

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద హనీఫ్ భార్య, బంధువులు ఆందోళనకు దిగారు. ఎన్‌కౌంటర్లో హతమైన వికారుద్దీన్ గ్యాంగుకు బుధవారం ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. హనీఫ్ మృతదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతించడం లేదని హనీఫ్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాలు లేనందునే ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. తన భర్తమృతదేహం ఇస్తే తీసుకు వెళ్తానని చెప్పారు.

హనీఫ్

హనీఫ్

వరంగల్ - నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో హతమైన వికారుద్దీన్‌కు ముషీరాబాదులో ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్న హనీఫ్ ఆర్థిక సాయం చేశాడు. పోలీసులు హానీఫ్‌ను అరెస్టు చేశాక వికారుద్దీన్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్

హైదరాబాద్

వరంగల్ - నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ హతం కావడంతో హనీఫ్ నివాసం వద్ద..

హైదరాబాద్

హైదరాబాద్

వరంగల్ - నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ హతం కావడంతో హనీఫ్ నివాసం వద్ద..

హైదరాబాద్

హైదరాబాద్

వరంగల్ - నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ హతం కావడంతో హనీఫ్ నివాసం వద్ద..

హైదరాబాద్

హైదరాబాద్

పాతబస్తీలోని దర్స్‌గా జిహాద్ ఒషహదత్ సంస్థలో వికారుద్దీన్ ఉన్నప్పుడు హనీఫ్‌తో పరిచయం ఏర్పడింది.

హైదరాబాద్

హైదరాబాద్

వరంగల్ - నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ హతం కావడంతో హనీఫ్ నివాసం వద్ద..

English summary
Dr Haneef, Vikaruddin's financial aid!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X