డ్రగ్స్ కేసు: ముగిసిన కమింగ విచారణ, కీలక విషయాలు వెల్లడి, ఫోన్లో వెయ్యి మంది కస్టమర్లు

విదేశాల నుంచి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లుగా ఆరోపణలను ఎదుర్కుంటున్న నెదర్లాండ్స్ ఐటీ నిపుణుడు మైక్ కమింగ పోలీసు విచారణ పలు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌: విదేశాల నుంచి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లుగా ఆరోపణలను ఎదుర్కుంటున్న నెదర్లాండ్స్ ఐటీ నిపుణుడు మైక్ కమింగ పోలీసు విచారణ పలు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో కీలక సూత్రధారి అయిన కమింగను మూడు రోజుల పాటు పోలీసులు విచారించారు. అతడి ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌లోని డేటా ఆధారంగా విచారణ సాగినట్టు సమాచారం. పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సలహాదారుగా ఉన్న కమింగ ఉద్యోగులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Drugs Case: Kamminga Custody Over, Key Points Cameout, 1000 customers in his phone

అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియాతో అతడికి లింకులున్నట్టు.. గోవా, ముంబై నుంచి హైదరాబాద్‌కు మత్తు పదార్థాలు సరఫరా చేసినట్టు విచారణలో వైల్లడైందని సమాచారం. విచారణలో తాను డ్రగ్స్‌ వాడుతున్నట్టు కమింగ స్వయంగా పోలీసులతో చెప్పినట్టు తెలిసింది.

కమింగ దగ్గర వందల మంది డ్రగ్స్‌ వినియోగదారుల లిస్ట్‌ ఉన్నట్టు సిట్‌ బృందం గుర్తించింది. సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాలర్‌ నిపుణుడిగా పేరు పొందిన అతడు హైదరాబాద్‌ యువతిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిర నివాసం ఏర్పచుకున్నాడు.

కమింగ తన ఇంటి నుంచే డ్రగ్స్‌ దందా సాగిస్తున్నట్టు సమాచారం. మూడు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+