నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమలం గూటికి డీఎస్..!! ఈటల సుదీర్ఘ మంతనాలు : రేవంత్ ఆహ్వానించినా...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. హుజూరాబాద్ లో విజయం సాధించిన ఈటల రాజేందర్ ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా పావులు కదుపుతున్నారు. బీజేపీ బలం రాష్ట్రంలో పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ లో కొనసాగుతూనే..పార్టీ తీరు పట్ల విముఖంగా ఉన్న నేతలను ముందుగా తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమం లో ముందుగా ఆయన టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ ను కలిసారు. సుదీర్ఘ మంతనాలు చేసారు.

ఈటల మంతనాల వెనుక

ఈటల మంతనాల వెనుక

ఆ సమయంలో డీఎస్ కుమారుడు..నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఉన్నారు. డీఎస్ ను బీజేపీ లోకి రావాలంటూ ఈటల ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీ కేవంల మర్యాదపూర్వకమనేనని బయటకు చెబుతున్నా... డీఎస్ వంటి సీనియర్ బీజేపీకి అవసమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డీఎస్ టీఆర్ఎస్ ఎంపీగా ఉండగా..ఒక కుమారుడు బీజేపీ ఎంపీగా.. మరో కుమారుడు కాంగ్రెస్ లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ సైతం డీఎస్ ను కలిసారు. తిరిగి కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానం..

బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానం..

ఆ సమయంలోనూ మర్యాద పూర్వక భేటీగానే చెప్పారు. డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పని చేసారు. వైఎస్సార్ హాయంలో పీసీసీ చీఫ్ గా ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మంత్రిగానూ పని చేసారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ ఆహ్వానం మేరకు చేరిన డీఎస్ ను రాజ్యసభ కు ఎంపిక చేసారు. కొంత కాలం డీఎస్ పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించినా..ఆ తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తన అసంతృప్తిని పలు సందర్భాల్లో పరోక్షంగా బయట పెట్టారు.

రాజకీయంగా మౌనంగా ఉంటున్న డీఎస్

రాజకీయంగా మౌనంగా ఉంటున్న డీఎస్

కానీ, నేరుగా ముఖ్యమంత్రి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. రేవంత్ స్వయంగా డీఎస్ ఇంటికి వెళ్లి సుదీర్ఘ మంతనాలు చేసారు. అయితే, డీఎస్ ను పలకరించేందుకే తాను వెళ్లినట్లుగా రేవంత్ చెప్పుకొచ్చారు, ఆ సమయంలో ఇక, డీఎస్ కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ టీఆర్ఎస్ లో ప్రచారం సాగింది. కానీ, ఆ తరువాత ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఏ విధంగా మౌనంగా ఉన్నారో..అదే విధంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు, ఈటల తాను ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత పలువురు నేతలను కలుస్తున్నారు.

Recommended Video

రైతులకు అన్యాయం జరిగితే సహించమన్న భట్టి విక్రమార్క || Oneindia Telugu
రేవంత్ సైతం ఆహ్వానించినా

రేవంత్ సైతం ఆహ్వానించినా

అయితే, డీఎస్ ను కలవటం వెనుక మాత్రం పార్టీ పెద్దలతో చర్చించిన తరువాతనే వచ్చినట్లుగా చెబుతున్నారు. బీజేపీలోకి రావాలని కోరినా.. డీఎస్ మాత్రం స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్ తన రాజకీయ భవిష్యత్ పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అయితే, ఆయన తిరిగి తాను సుదీర్ఘ కాలం పని చేసిన కాంగ్రెస్ లోకి వెళ్తారా ...లేక, కాషాయం కండువా కప్పుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

డీఎస్ నిర్ణయం ఏంటి

డీఎస్ నిర్ణయం ఏంటి

డీఎస్ కుమారుడు అర్వింద్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. ఇద్దరు కుమారులు రెండు పార్టీల్లో ఉండటంతో..ఆయన నిర్ణయం తీసుకోవటంలో ప్రభావం చూపిస్తుందనే వాదన ఉంది. దీంతో..ఇప్పుడు డీఎస్ నిర్ణయం తీసుకొనే వరకూ వేచి చూసే ధోరణితోనే టీఆర్ఎస్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి..డీఎస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

English summary
BJP MLA Etala Rajender mer TR MP and senior politician D Srinivas , now became big discussion in state politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X