వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్టీ ఎఫెక్ట్: పెరిగిన స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు, బంగారం పాత ధరకే

జీఎస్టీ ప్రభావం కన్పిస్తోంది. శనివారం నుండే జీఎస్టీ అమల్లోకి వచ్చింది. వస్తు సేవల పన్ను మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం చూపుతోంది. అత్యధికశాతం ప్నను శ్లాబ్ లలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, కాస్మోటిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీఎస్టీ ప్రభావం కన్పిస్తోంది. శనివారం నుండే జీఎస్టీ అమల్లోకి వచ్చింది. వస్తు సేవల పన్ను మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం చూపుతోంది. అత్యధికశాతం ప్నను శ్లాబ్ లలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, కాస్మోటిక్స్, ఫోన్ల ధరలు, వినోదరంగానికి చెందిన సేవల ఛార్జీలు భారీగా పెరిగాయి.

జీఎస్టీ అమలు తర్వాత దాని ప్రభావం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో అనే విషయమై స్పష్టమౌతోంది. సుమారు 1200 రకాల వస్తువులపై జీఎస్టీ ప్రభావం స్పష్టంగా కన్పించనుంది.

Recommended Video

గతంలో మాదిరిగా పలు రకాల పన్నులతో సామాన్యుల జేబులు చిల్లులు పడవని అధికారులు ప్రకటిస్తున్నారు. జీఎస్టీ పన్నుతోనే వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు లభ్యమయ్యే పరిస్థితి ఉంటుందంటున్నారు.

జీఎస్టీ చట్టం కింద డీలర్లు లేదా అధికారులు ఎవరైనా తప్పు చేస్తే కేసులు ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాయి. అయితే వాటిని సక్రమంగా అమలు చేస్తే మంచి పలితాలు వస్తాయి.

తొలిరోజు నుండే జిఎస్టీ ప్రభావం

తొలిరోజు నుండే జిఎస్టీ ప్రభావం

జీఎస్టీని అమలు చేసిన తొలిరోజునుండే దాని ప్రభావం కన్పిస్తోంది. 1200 రకాల వస్తువులపై దీని ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ వస్తువుల ధరలు జూన్ 30వ, తేది నాటి ధరలతో పోలిస్గే ఎక్కువగానో, తక్కువగానో ఉండే పరిస్థితి కన్పిస్తోంది.ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారంగా మారాయి. రెస్టారెంట్లు, హోటళ్ళ ధరలు మరింత పెరిగాయి. పన్నులు తగ్గే వస్తువువలను జీఎస్టీ అమలయ్యే నాటికే విక్రయించేందుకు వ్యాపారులు ప్రయత్నాలను చేశారు.

స్మార్ట్ పోన్ల ధరలు పెరిగాయ్

స్మార్ట్ పోన్ల ధరలు పెరిగాయ్

జీఎస్టీ అమలు తర్వాత స్మార్ట్ పోన్ల ధరలు పెరిగిపోయాయి. సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ జీ 615 మోడల్ ధర గతంలో రూ.15,291 ఉంటే, ప్రస్తుతం దాని ధర రూ.17, 100 కు చేరుకొంది. జీఎస్టీ అమలుకు ముందు 5 శాతం వ్యాట్ ఉంటే, ఇప్పుడు 12 శాతం జీఎస్టీని విధించారు. టీవీలు, ఫ్రిజ్ లు, ఏసీ, వాషింగ్ మెషిన్లు, కూలర్లు, మైక్రో వేవ్ ఓవెన్ లాంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీలో 28 శాతం పన్ను విధించారు.

టీవీల ధరలకు రెక్కలు

టీవీల ధరలకు రెక్కలు

టీవీలపై జీఎస్టీ అమలుకు ముందు కేవలం 14.5 శాతం మాత్రమే పన్ను ఉండేది. జీఎస్టీ అమలు తర్వాత టీవీలపై 28 శాతం పన్ను విధించారు. సోనీ ఎల్ఈడీ టీవి మోడల్ (డబ్ల్యూ562) ధర జీఎస్టీ అమలుకు ముందు రూ.37,773, జీఎస్టీ అమలు తర్వాత రూ.42,227 కు పెరిగింది. వాస్తవంగా ఈ ఎల్ ఈ డీ టీవి ధర రూ.32,990 మాత్రమే. దీనికి స్టేట్ జీఎస్టీ రూ.4,618, సెంట్రల్ జీఎస్టీ కలుపుకొని రూ.42,227 కు చేరింది.

రెస్టారెంట్ కు వెళ్తే జేబుకు చిల్లే

రెస్టారెంట్ కు వెళ్తే జేబుకు చిల్లే

విందులు, వినోదాలపై జిఎస్టీ ప్రభావం తీవ్రంగానే కన్పించింది. రోటీ, బిర్యానీతో కలిపి ధర రూ.1,362. దానిపై రూ.207 జీఎస్టీ భారం పడింది. కాఫీ ధర రూ. 32 నుండి రూ.38కి పెరిగింది. ఇక సినిమా టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. రూ.100 టిక్కెట్టుకు పన్నుతో రూ.118 వసూలు చేశారు. పలు ఏసీ హోటళ్ళు, లాడ్జీలు, రెస్టారెంట్లలో 10 శాతం జీఎస్టీ వేయడంతో వినియోగదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సగటున ప్రతి లావాదేవీపై రూ. 100 నుండి 300 వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. సినిమా థియేటర్లలో జీఎస్టీ పేరుతో టిక్కెట్ పై 18 శాతం అదనంగా ఛార్జీని వసూలు చేశారు.

బంగారంపై ప్రభావం లేదు

బంగారంపై ప్రభావం లేదు

జిఎస్టీ అమల్లోకి వచ్చినా బంగారం వ్యాపారంపై పెద్దగా ప్రభావం చూపలేదు. జీఎస్టీ అమలైనా అదనంగా ఒక్కశాతం మాత్రమే భారం పడుతోందని వ్యాపారులు చెబుతున్నారు. నిత్యావసరధరలు కూడ పాత ధరలకే విక్రయించనున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, వంటనూనెలపై పెద్దగా భారం ఉండదు.

English summary
At the stroke of the midnight hour, India launched its ambitious pan-India indirect tax regime, the Goods and Services Tax (GST) to bind the country into a regime of 'one nation, one tax, one market'. The new tax regime, the Goods and Services Tax (GST) brings massive changes in one of the largest economies of the world. The GST will change the way people conduct businesses in India as the country will become a single market with a single tax rate, irrespective of the state you conduct your business in. Barring a few exemptions, from the smallest entity on the economic food chain to multi-billion conglomerates, no one will stay untouched by the GST.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X