డ్రంకన్ డ్రైవ్ పై సజ్జనార్ పంజా.. !!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో భద్రతకు సంబంధించి నగర పోలీసులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబర్ 31 రాత్రి నుండి జనవరి 1 తెల్లవారుజామున జరుపుకునే వేడుకల కోసం త్రీ స్టార్, అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న హోటళ్లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు/పబ్‌ల నిర్వాహకులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈవెంట్లను అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకు నిర్వహించాలనుకునే యాజమాన్యాలు తప్పనిసరిగా ముందుగానే అనుమతి తీసుకోవాలి.
ఈ నేపథ్యంలో వారం రోజులు ముందు నుంచే హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నారు. బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా 'స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్' నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు. అంతకుముందు ఆపరేషన్ కవచ్ చేపట్టారు సజ్జనార్. ఇది అంచనాలకు మించిన ఫలితాలను ఇచ్చింది. పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. గంజాయి సైతం దొరికింది పోలీసులకు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హవాలా వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, ప్రజా భద్రతను పెంపొందించడంలో ఇదొక భాగం.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications