టెక్కీ వారిని అనుసరించింది, అంతా నిమిషంలోనే: ఆ ఇద్దరు తృటిలో తప్పించుకున్నారు
బంజారాహిల్స్‌లోని పింఛన్ ఆఫీస్ వద్ద మృతి చెందిన మహిళా టెక్కీ శిరీష ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ ఫుటేజీలను కేసు దర్యాఫ్తు చేస్తున్న అధికారులు గురువారం పరిశీలించారు.
Recommended Video

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని పింఛన్ ఆఫీస్ వద్ద మృతి చెందిన మహిళా టెక్కీ శిరీష ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ ఫుటేజీలను కేసు దర్యాఫ్తు చేస్తున్న అధికారులు గురువారం పరిశీలించారు.
చదవండి: డ్రైవర్ తొందరపాటు, టెక్కీ చెవిలో ఇయర్ ఫోన్స్: బస్సు చక్రం కిందపడి టెక్కీ శిరీష మృతి

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా
ఆ సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వీడియోల ఆధారంగా ప్రమాదం ఒక్క నిమిషంలోనే జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఆమె రోడ్డు మలుపు తిరుగుతుండటం, బస్సు హఠాత్తుగా వచ్చి ఆమెను ఢీకొట్టడం అంతా నిమిషంలోనే జరిగిందని గుర్తించారు.

శిరీష ఆ ఇద్దరు యువతులను ఆనుసరించింది
సీసీటీవీ ఫటేజీ ప్రకారం.. శిరీష మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్కి పింఛన్ కార్యాలయం వద్ద దిగారు. ఆమె కంటే ముందు ఇద్దరు యువదులు బస్సు దిగారు. ఆమె కంటే ముందు దిగిన యువతులు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. శిరీష కూడా వారిని అనుసరించింది.

బస్సు ముందుకు కదిలింది
ఈ మయంలో ఒక్కసారిగా బస్సు ముందుకు కదిలింది. ఆ బస్సు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికి అక్కడే మృతి చెందారు. కాగా ఆమె దిగిన బస్సే ఢీకొట్టింది.

విచారణలో డ్రైవర్ బాబు
బస్సు ప్రమాదంపై డ్రైవర్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రయాణీకులు దిగడం చూశానని, కానీ బస్సు ముందు నుంచి వెళ్తున్నట్లు గుర్తించలేదని చెప్పారు.

శిరీషకు అంత్యక్రియలు
కాగా, శీరీష సొంతూరు ఖమ్మం జిల్లా కొత్తగూడ ప్రాంతంలోని రుద్రారం గ్రామం. పట్టుదలతో ఎంసీఏ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఆగస్టులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మురళీకృష్ణాచార్యులతో వివాహమైంది. గురువారం గాజులరామారంలో అంత్యక్రియలు చేశారు.
-
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications