వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ దీక్షకు పన్నెండేళ్లు.!నేడు దీక్ష దివస్.! జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంత్రలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాదనుకున్న తెలంగాణ వచ్చేందుకు బీజం పడ్డ రోజు. అసాద్యముకున్న ఘట్టం సుసాద్యమైన రోజు. తెలంగాణ కాంక్షను ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. నాలుగు కోట్ల గొంతుకలను ఒక్కటి చేసి దిక్కులు పిక్కటిల్లేలా ధ్వనింపజేసిన రోజు. స్వీయ పాలనా మాధుర్యాన్ని స్వయంగా అనుభవించాలని చావును సైతం ఎదురించిన రోజు. పరాయి పెత్తనాన్ని తరిమికొట్టి తెలంగాణ స్వేఛ్చా వాయువుల కోసం ఊపిరిసైతం బిగబట్టి మృత్యువుకు రొమ్ము విరిచి చూపించిన రోజు. పదునైన ఆయుధాలు లేవు, అధునాతన అస్త్రాలు లేవు, సైన్యం లేదు, రణరంగం లేదు.. ఉందల్లా ఒక్కటే..గుండే నిండా ధైర్యం, మొక్కవోని ఆత్మవిశ్వాసం.

 దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..

దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..

కనిపించని ఈ రెండు ఆయుధాలతోనే తెలంగాణ సాధించాడు ఓ యోధుడు. బిగించిన పిడికిలిని చివరివరకూ విడవకుండా అనకున్నది సాధించాడు, యావత్ తెలంగాణ ప్రజలకు స్వేచ్చా స్వాతంత్ర్యపు కుసుమాలను అందించాడు. అతనే తెలంగాణ సాధించిన ధీరుడు, తెలంగాణ ప్రజలకు వీరుడు కల్వకుంట్ల చంద్రేఖర్ రావు. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున ప్రతేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన దిక్ష కారణంగానే అసాద్యమనుకున్న తెలంగాణ సుసాద్యమైందని, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, రాజకీయ నేతలు.

కేసీఆర్ సత్యాగ్రహానికి తలవంచిన కేంద్ర..

కేసీఆర్ సత్యాగ్రహానికి తలవంచిన కేంద్ర..

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక చంద్రేఖర్ రావు పదవులను తృణప్రాయంగా వదిలేసి పోరుబాట పట్టిన యోధుడని మంత్రి కొప్పులఈశ్వర్ కొనియాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు టిఆర్ఎస్ ను స్థాపించి సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి మహోద్యమాన్ని నడిపిన మహానేత చంద్రేఖర్ రావు అని కొప్పుల అన్నారు. తాను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న చంద్రేఖర్ రావు ఆమరణ దీక్షకు దిగిన రోజు చారిత్రాత్మకమైనదని దీక్షా దివస్ సందర్భంగా ఈశ్వర్ వ్యాఖ్యానించారు.

 ఉద్యమానికి రణ నినాదం..

ఉద్యమానికి రణ నినాదం..

చంద్రేఖర్ రావు తాను సాధించిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్నారని ఒక ప్రకటనలో మంత్రి కొప్పుల పేర్కొన్నారు. పుట్టిన ఏడేళ్ల ప్రాయంలోనే తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే పత్రిక తమ నివేదికలో సుస్పష్టంగా పేర్కొనడాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. యావత్ తెలంగాణ ప్రజల గొంతుక ఒక్కటై తెలంగాణ కాంక్షను ప్రపంచానికి వినిపించి అసాద్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన ధైర్య శీలి చంద్రశేఖర్ రావని గుర్తు చేసుకున్నారు ఈశ్వర్.

శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి..

శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి..

చంద్రశేఖర్ రావు దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందదని, చరిత్ర గతినే మార్చి వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి, ఒక సత్యాగ్రహ ఉద్యమంలా మారిందన్నారు. మొత్తం ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన ఆనాటి చంద్రశేఖర్ రావు దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్ గా జరుపుకోవడం, ఆనాటి చంద్రశేఖర్ రావు త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమే అన్నారు. ఈ రోజు కి దీక్షా దివస్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఒళ్ళు పులకరిస్తుందినా ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

English summary
The Telangana leaders remembered that the voice of the people of Telangana was the only voice that heard the desire of Telangana to the world and that the brave style of Chandrasekhar who made Telangana impossible was not coming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X