వారిద్దరి భేటీతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మలుపు?
బెంగళూరులో ఓ ప్రయివేటు కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుసుకొని కొంచెంసేపు మాట్లాడుకున్నారు. గుర్రాల రేసింగ్స్ కు సంబంధించిన ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. అయితే ఈ కలయికపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతివ్వడంతో ఫార్ములా ఈరేసింగ్ కేసుకు సంబంధించి కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ విషయంలో సానుకూలంగా లేరనే వార్తలు కూడా మరోవైపు నుంచి వస్తున్నాయి.
తీర్పులు ఎలా వస్తాయో అని చర్చ
ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏమిటి? అనే విషయమై కేటీఆర్ జగన్ తో చర్చించారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అక్రమాస్తుల కేసుల్లో 13 సంవత్సరాల నుంచి దేశంలోనే బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ కావడంతో న్యాయ సలహా అడిగివుంటాడంటూ కాంగ్రెస్ శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్నాయి. న్యాయవ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలి? బెయిల్ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? డిశ్చార్జి పిటిషన్లు వేసి అసలు పిటిషన్లు విచారణకు రాకుండా ఉండటానికి రచించాల్సిన వ్యూహాలను, ఎవరు ఎలాంటి కేసుల్లో తీర్పులిచ్చారు? తనకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎటువంటి తీర్పులు జడ్జి నుంచి వెలువడే అవకాశం ఉంది? లాంటి వివరాలన్నీ చర్చించుకొని ఉంటారంటూ ఏపీలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సెటైర్స్ వేస్తున్నాయి.

ధనవంతులు మాత్రమే ఆడే ఆట ఇది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో నారా లోకేష్ ను కేటీఆర్ కలిశారంటూ వార్తలు వచ్చాయి. అయితే కేటీఆర్ ఆ వార్తలను ఖండించకపోవడంతో కలిసింది వాస్తవమే అని బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిర్థారించుకున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు మిత్రులైన జగన్, కేటీఆర్ కలుసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన అంశంగా మారింది. యాధృచ్ఛికంగా వీరిద్దరినీ ఈ కార్యక్రమానికి పిలవడం జరిగిందా? లేదంటే ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన కంపెనీ యజమానికి ఈ ఇద్దరు నేతలకు సన్నిహితుడా? ధనవంతులు మాత్రమే ఆడే ఇలాంటి ఆటకు ఈ ఇద్దరు ధనవంతులు రావడం అనేది అనుకోకుండా జరిగిందా? అంటూ ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications