Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ రాజకీయం మొత్తం ఆ పార్టీ చుట్టూనే తిరుగుతుండటం గమనార్హం. అంటే.. కేసీఆర్, కేటీఆర్ ఎంతగా టీడీపీ ముద్రను తెలంగాణ నుంచి చెరిపేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ రోజురోజుకు అది మరింతగా బలపడుతోందేకానీ బలహీనమవడంలేదని స్పష్టమవుతోంది. భారత రాష్ట్ర సమితి మాత్రం నీళ్లు లేని బావిలా అడుగంటిపోయింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జూబ్లీహిల్స్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ సహా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్ లోకి బలవంతంగా చేర్చుకున్నారు.

మీ రాష్ట్రం వెళ్లి చేసుకోండంటూ అహంకరించాడు
కేసీఆర్ తన పార్టీ బలోపేతం కోసం కష్టపడటం మానేసి తెలుగుదేశం పార్టీని బలహీనం చేసేందుకే ఎక్కువగా శ్రమించారు. ఇక పార్టీ లేదు అనుకున్నారుకానీ బీసీ వర్గాల్లో అంతర్గతంగా బలపడేవుందని, సరైన సమయంలో, సరైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోందని అర్థమయ్యేసరికి ఘోరపరాజయం పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటును గెలుచుకోలేకపోయారు. జూబ్లీహిల్స్ లో గెలిచి పరువు నిలబెట్టుకొని రాష్ట్ర స్థాయిలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచాలంటే ఇక్కడి సెటిలర్ల ఓట్లు ముఖ్యం. అందుకే బీఆర్ఎస్ నాయకులంతా ప్రచారంలో ఎన్టీఆర్ పై, చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంటే వీరి మాటలకు కరిగిపోయి సెటిలర్లు ఓట్లు వేస్తారనుకోవడం కూడా భ్రమే. చంద్రబాబును జగన్ అరెస్ట్ చేసిన సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నిరసనలు చేస్తుంటే మీ రాష్ట్రం వెళ్లి చేసుకోండి.. ఇక్కడ కాదు అంటూ అహంకరించి మాట్లాడాడు కేటీఆర్. ఇప్పుడు మాత్రం అదే టీడీపీ ఓట్లు కావాలంటున్నారు.

Jubilee Hills by-election revolving around the Telugu Desam Party

రేవంత్ వైపు టీడీపీ శ్రేణులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపిస్తే అమీర్ పేట మైత్రీవనం చౌరస్తాలో నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి హోదాలో తానే వచ్చి ప్రారంభిస్తానని మాట ఇచ్చారు. గతంలోనే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుపడ్డ దుర్మార్గుడు కేసీఆర్ అని, అటువంటి వ్యక్తిని మూసీలో బొందపెడతానని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేయకపోవడంవల్ల రేవంత్ కు కలిసివచ్చింది.

అలాగే ఈసారి జూబ్లీహిల్స్ లో కూడా పోటీకి దూరంగా ఉండటంవల్ల రేవంత్ కు కలిసివస్తుందేమో చూడాలి. ఎందుకంటే నగరంలోని టీడీపీ శ్రేణులంతా రేవంత్ వైపే మొగ్గుచూపుతారు. వారికి ముఖ్యమంత్రిపై ప్రత్యేక అభిమానం ఉంటుంది. బీఆర్ఎస్ నేతల బెదిరింపులు తట్టుకోలేక గత ఎన్నికల్లో నగరంలోని సెటిలర్లు ఆ పార్టీకి ఓటువేశారుకానీ, ఒకసారి రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనవైపే మొగ్గుచూపే అవకాశం కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+