వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్యా.. కామారెడ్డి వ్యక్తికి మంకీపాక్స్ నెగిటివ్: పుణె వైరాలజీ విభాగం

|
Google Oneindia TeluguNews

కామారెడ్డికి చెందిన వ్యక్తిక మంకీపాక్స్ నెగిటివ్ వచ్చింది. ఈ మేరకు పుణె వైరాలజీ విభాగం వెల్లడించింది. అతని శాంపిల్ సేకరించి పంపించిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అతనికి నెగిటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. ఇప్పటికే అతని ఇంటిని శానిటైజేషన్ చేశారు. కాంటాక్ట్‌‌లో ఉన్నవారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచారు.

అంతకుముందు అతని ఉంటోన్న ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న 8మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అతడిని హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతను ప్రత్యేక వార్డులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి నుంచి 5 రకాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కి పంపగా నెగిటివ్ వచ్చింది.

kamareddy youth has monkey fox negative

ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి వచ్చాడు. అతనికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆందోళన నెలకొంది. 20వ తేదీన జ్వరం వచ్చింది. 23వ తేదీ నాటికి ఒళ్లంతా ర్యాషెస్ రావడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు.. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary
kamareddy person has monkey fox negative pune virology department said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X