కాళేశ్వరం ప్రాజెక్టు పై కవిత సంచలన వ్యాఖ్యలు..!!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తన జిల్లాల పర్యటనలో భాగంగా కవిత బీఆర్ఎస్ మాజీ మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. స్థానిక సమస్యల పైన ప్రస్తావిస్తున్నారు. జిల్లాల్లోని పలు అంశాల పైన స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని కవిత నిలదీస్తున్నారు. ఇదే సమయంలో కవిత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు గలాబీ పార్టీలో చర్చగా మారాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆరోపణలు రావటంతో కేసీఆర్ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించారు. కాగా, ఇప్పుడు కామారెడ్డిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత కాళేశ్వరం పైన స్పందించారు. ఈ ప్రాజెక్టుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూడికతీతను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజాంసాగర్ టూరిజం, కౌలాస్ కోట ఓ స్పాట్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. మొంథా తుఫానుతో జిల్లాలో పత్తి రైతులు నష్టపోయారని చెప్పుకొచ్చారు. జుక్కల్ ప్రాంతంలో జిన్నింగ్ మిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జిన్నింగ్ మిల్ కోసం జాగృతి పోరాటం చేస్తోందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పేరుతో డబ్బులు తీసుకోవద్దని సూచించారు. ఇక..ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో ఎందుకు కనిపించడం లేదని కవిత ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి ఆయా సమస్యలపై పార్టీలను ప్రశ్నించాలని సూచించారు.
రోడ్ల కోసం ఆందోళన చేస్తుంటే జుక్కల్ ఎమ్మెల్యే యువకుల మీద కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. యువతపై నమోదైన కేసులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 317 జీవోతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే ఉద్యోగులను తిరిగి స్వస్థలాలకు పంపించాలని సూచించారు. గొర్రెల కోసం డీడీలు కట్టి చాలా మంది అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. అర్హులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని కోరారు. ఆటోవాళ్లకు వేల్ఫెర్ బోర్డు ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications