వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అడుగులు- టార్గెట్ బీజేపీ : లెఫ్ట్ కీలక నేతలతో సుదీర్ఘ భేటీ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్..జాతీయ స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపు తున్నారు. గత ఎన్నికల సమయంలోనే ఇటువంటి ప్రయత్నాలు జరిగినా.. మధ్యలోనే ఆగిపోయాయి. అయితే, ఇప్పుడు మాత్రం పక్కా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే పార్టీలతో మంతనాలు ప్రారంభించారు.

లెఫ్ట్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ వెనుక

లెఫ్ట్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ వెనుక

నాన్ బీజేపీ..నాన్ కాంగ్రెస్ కూటమి పార్టీల ఐక్యత ..వాటిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే విధంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడులో ఆలయ సందర్శన కోసం వెళ్లిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇక, ఇప్పుడు హైదరాబాద్‌ సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్‌ను లంచ్‌కు పిలిచి మరీ చర్చలు జరిపారు. బీజేపీ తీరుపై కేరళ సీఎంతోపాటు సీపీఎం ఢిల్లీ నేతలతోనూ చర్చించారు కేసీఆర్‌. కేంద్రం నిర్ణయాలు, రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ..కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పోరాటానికి సరైన సమయంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సీపీఎం - సీపీఐ నేతలతో కీలక చర్చలు

సీపీఎం - సీపీఐ నేతలతో కీలక చర్చలు

ఇటీవలే ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ఆ సాయాన్ని అందించేందుకు ఇతర రాష్ట్రాలు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అయితే, కేరళ ముఖ్యమంత్రితో పాటుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, పొలిట్ బ్యూర్ సభ్యుడు ప్రకాశ్ కారత్‌ కూడా ఉన్నారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ జరగింది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయడంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో సీపీఎం కేంద్ర నాయకత్వంతో ఢిల్లీలో కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత..సీపీఐ రాష్ట్ర నాయకులతో కేసీఆర్‌ సమావేశంకానున్నట్లు సమాచారం.

బీజేపీ - కాంగ్రెసేతర పార్టీలతో కలిసి ముందుకు

బీజేపీ - కాంగ్రెసేతర పార్టీలతో కలిసి ముందుకు


ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారుపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు వామపక్షాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సీపీఎం నేతలతో భేటీ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఐ నేత డి.రాజాతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీల్లో బీజేపీ వ్యతిరేక కార్యచరణపై చర్చలు జరినట్లు తెలుస్తోంది. త్వరలో ఢిల్లీ కేంద్రం బీజేపీ - కాంగ్రెసేతర పార్టీల నేతలతో సీఎం సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ కేంద్రంగా సాగించిన మంతనాలు జాతీయ స్థాయిలో రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి.

English summary
Telangana CM KCR and Kerala CM Pinarayi Vijayan met and discussed on third front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X