ఒక్క డోస్ ప్లీజ్: డ్రగ్ కోసం అధికారుల వద్ద కెల్విన్, బయటకొస్తా.. వ్యాపారం చేస్తా!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డ్రగ్స్ కోసం పలువురు సినీ ప్రముఖులను తన చుట్టూ తిప్పుకొని, తన కాళ్లావేళ్లా పడేలా చేసిన కెల్విన్‌ ఇప్పుడు అదే డ్రగ్ కోసం విలవిల్లాడుతున్నాడు.

బిగ్ బాస్ షోలో డ్రగ్ రాకెట్ నోటీసులు అందుకున్న వారు, తలనొప్పి?

డ్రగ్స్‌కు అతను బాగా అలవాటు పడ్డాడు. అరెస్టు కావడంతో అతనికి గత పది రోజులుగా అవి లభించడంలేదు. దాంతో విలవిల్లాడుతున్నాడని తెలుస్తోంది.

పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు

పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు

ఆ బాధతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. బిర్యానీ కావాలని, సిగరెట్లు కావాలని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నాడని తెలుస్తోంది.

మళ్లీ వస్తా, వ్యాపారం చేస్తా

మళ్లీ వస్తా, వ్యాపారం చేస్తా

అప్పుడప్పుడూ తనకు కాస్త డ్రగ్స్ ఇప్పించమని అధికారులను అడుగుతున్నాడు. డ్రగ్స్ కేసులో 2013లో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన కెల్విన్‌ ఇప్పుడు తనకు ఏమీ కాదని, త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని, మళ్లీ వ్యాపారం చేసుకోవచ్చునని కూడా చెబుతున్నాడని తెలుస్తోంది.

అక్కడి నుంచి డ్రగ్స్

అక్కడి నుంచి డ్రగ్స్

కెల్విన్‌ ఎక్కువగా ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా గోవా, ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించుకునేవాడు. ఎవరెవరి ద్వారా తెప్పించుకునేవాడో సమాచారం సేకరించిన అధికారులు దాన్ని ఆయా రాష్ట్రాల పోలీసులతో సమాచారం పంచుకుంటున్నారు.

డ్రగ్స్ దొరకడం లేదు

డ్రగ్స్ దొరకడం లేదు

విచారణలో కెల్విన్‌ చెప్పిన వివరాల ఆధారంగా రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు కొంతమంది ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కానీ ఎక్కడకు వెళ్లినా వారికి చుక్కెదురయిందని తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుండటంతో ఇప్పటికే స్టాక్‌ పెట్టుకున్నవారు దాన్ని నాశనం చేశారని తెలుస్తోంది.

మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి

మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి

కెల్విన్‌ అరెస్టయినప్పటికీ అతని ఫోన్‌కు వస్తున్న సందేశాలు, ఫోన్‌ కాల్స్‌ మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. కెల్విన్‌ అరెస్టు గురించి తెలియని వారు అతనిని ఫోన్‌ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై అధికారులు దృష్టి సారించారు. ఈ కాల్స్ ఎక్కువగా గోవా నుంచి వస్తున్నాయని గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Drug supplier Kelvin is asking for drugs in Police custody. He supplied drugs to many tollywood personolities. After arresting he asking for drugs.
Please Wait while comments are loading...