ప్రధాని మోడీ కట్టప్ప కాదు... బాహుబలి, ఆయన కోసం: కృష్ణం రాజు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బాహుబలి గురించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా గొప్పగా చెప్పారని బీజేపీ నేత, ప్రముఖ నటుడు కృష్ణం రాజు అన్నారు. బాహుబలి 2 (ది కంక్లూజన్) ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు.

తాను యూపీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ కలయిక ఇష్టం లేదు!: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, కేటీఆర్‌పై విమర్శ

మీరు బాహుబలి చూశారా? అందులో కట్టప్పను చూశారా? ఆ కట్టప్పని నేనే అని, ప్రధానమంత్రి కుర్చీని కాపాడడానికి కట్టప్పలా పోరాడుతానని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారని కృష్ణం రాజు చెప్పారు.

Krishnam Raju praises PM Modi in function

దానికి తాను సమాధానం ఇచ్చానని, మోడీ కట్టప్ప కాదని, బాహుబలి అని కృష్ణం రాజు చెప్పారు. ఈ దేశానికి ఆయనే రాజు అని, బాహుబలి కుర్చీని కాపాడడానికి తనతో పాటు 120 కోట్ల మంది కట్టప్పలు ఉన్నారని చెప్పానని కృష్ణం రాజు తెలిపారు.

కాగా, అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో బాహుబలి ఫీవర్ కనిపించిన విషయం తెలిసిందే. ప్రచారంలో బాహుబలిని ఉపయోగించుకున్నారు. మోడీ బాహుబలిని ప్రస్తావించారు.

ఇక, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అయితే నాటి సీఎం (ప్రస్తుతం మాజీ సీఎం) హరీష్ రావత్‌ను బాహుబలిలా చూపిస్తూ వీడియో రూపొందించారు. హరీష్ రావత్‌ను యూపీని రక్షించే బాహుబలిలా చూపించి ప్రచారం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor and BJP leader Krishnam Raju on Sunday praised PM Narendra Modi in Ciname function.
Please Wait while comments are loading...