వైరల్ వీడియో: మెస్సీ vs సీఎం రేవంత్ మ్యాచ్.. గోల్ కొట్టిన సీఎం
ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది మెస్సీ జట్టు. సింగరేణి ఆర్ ఆర్ టీమ్ తరఫున మైదానంలోకి దిగిన రేవంత్ రెడ్డి గోల్ కొట్టారు. దీంతో స్టేడియం అంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఆ తరువాత మెస్సీ గ్రౌండ్ లోకి దిగి కాసేపు సీఎం రేవంత్ రెడ్డితో గేమ్ ఆడారు. ఈ క్రమంలో మెస్సీ రెండు గోల్స్ కొట్టారు. సీఎం రేవంత్ మనవడితోనూ మెస్సీ సరదాగా ఆట ఆడారు. సీఎం రేవంత్.. తన మనవడిని పరిచయం చేసి ఆట ఆడించారు. అనంతరం ప్లేయర్స్ తో కలిసి ఫొటో దిగారు.

రాష్ట్రంలో ఫుట్ బాల్ క్రీడను ప్రోత్సహిస్తూ.. ఉప్పల్ మైదానం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి జట్టు, ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ జట్టు మధ్య జరిగిన చారిత్రక ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ విజయవంతంగా ముగిసింది. సింగరేణి ఆర్ ఆర్ జట్టు తరఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. వెంటనే గోల్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీఎం రేవంత్ గోల్ కొట్టడంతో స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగింది. మెస్సీ జట్టుపై 3-0 గోల్స్ తో సింగరేణి ఆర్ ఆర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మెస్సీ మూడు గోల్స్ కొట్టారు. ఆ తర్వాత ఇరు జట్ల ప్లేయర్స్ తో మెస్సీ ఫోటో దిగారు.
A celebration of football, leadership & flawless hosting! GOAT #Messi𓃵 vs CM #RevanthReddy match lit up RGI Uppal Stadium. Amid the backdrop of #Kolkata event chaos, #Hyderabad stood out with elaborate security and seamless arrangements, welcoming #RahulGandhi and other… pic.twitter.com/h9SXyQq06x
— Ashish (@KP_Aashish) December 13, 2025
మ్యాచ్ ముగిసిన అనంతరం విన్నర్, రన్నరప్ జట్ల సభ్యులకు ట్రోఫీలను మెస్సీ, రేవంత్ రెడ్డి అందించారు. ఈ పోరులో సింగరేణి ఆర్ ఆర్ టీమ్ (సీఎం జట్టు) విజేతగా నిలిచింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి స్టేడియం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ క్రమంలో మెస్సీ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రజలను కలవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజలు చూపించిన అభిమానం నాకు ఎంతో శక్తి ఇచ్చిందని అన్నారు. ఇక ఈ మ్యాచ్ చూడ్డానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకగాంధీ కుమారుడు, కుమార్తె ఫుట్ బాల్ మ్యాచ్ ను వీక్షించారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications