హైదరాబాద్ లో గజిబిజి గందరగోళానికి పుల్ స్టాప్: రూ.4,051 కోట్లతో భారీ ప్రాజెక్ట్
సుదీర్ఘకాలంగా హైదరాబాద్ అత్యంత సమస్యాత్మంగా మారిన ఓవర్ హెడ్ విద్యుత్ తీగలను భూగర్భ కేబులింగ్గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగు మెట్రో జోన్లలో విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలలో భారీ మార్పులను తీసుకుని రానుంది. భూగర్భ విద్యుత్ వ్యవస్థ కోసం 4,051 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది. దశలవారీగా ఈ పనులు కొనసాగనున్నాయి. ఇకపై నగరంలో ఓవర్ హెడ్ విద్యుత్ కేబుళ్ల కనిపించవు.
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో 3,899 కిలోమీటర్ల ఓవర్‌హెడ్ లైన్లను భూగర్భ కేబుల్స్గా మారతాయి. ఇందులో 33, 11 కేవీ, లో- ఓల్టేజీ లైన్లు ఉన్నాయి. బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ నాలుగు కీలక మెట్రో జోన్ల పరిధిలో ఈ పనులు అమలు కానున్నాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా జనసమ్మర్థంతో కూడుకుని ఉన్నవి కావడం, ఓవర్ హెడ్ లైన్ల వల్ల నిర్మాణ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నందున తొలుత ఆయా జోన్లను ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఈ 4,051 కోట్ల రూపాయల నిధులను సదరన్ డిస్కమ్ సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తన అంతర్గత నిధులు లేదా రుణాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై తక్షణ బడ్జెట్ కేటాయింపుల అవసరం ఉండదు. ఆ భారం కూడా పడదు. కాలక్రమేణా దశలవారీగా వివిధ టారిఫ్‌లను పెంచడం, అంతర్గతంగా నిధులను సమీకరించుకోవడం ద్వారా ఖర్చులను తిరిగి రాబట్టుకోవడానికి ఎస్పీడీసీఎల్ వీలు కలుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ లో టెలికాం/ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టీ- ఫైబర్ సంస్థలు ఖర్చు పంచుకుంటాయి. ఈ భూగర్భ కేబులింగ్ పనుల్లో ఆయా సంస్థలు కూడా భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఆయా సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం వల్ల సదరన్ డిస్కమ్ పై మొత్తం ప్రాజెక్టు వ్యయం తగ్గుతుంది. భవిష్యత్తులో రోడ్ల తవ్వకాలు, వాటికి సంబంధించిన అంతరాయాలు తగ్గుతాయి. విద్యుత్, టెలికాం రెండింటికీ ఏకీకృత భూగర్భ యుటిలిటీ నెట్వర్క్ ఏర్పడుతుంది.
ఈ భూగర్భ కేబులింగ్ ప్రాజెక్టు అనేక ప్రయోజనాలను ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఓవర్ హెడ్ వైర్లు లేకపోవడం వల్ల నగరం అందంగా మారుతుంది. వాతావరణ సంబంధిత అంతరాయాలు తగ్గుతాయి. ఎక్కడికక్కడ విద్యుత్ తీగలు తొలగిపోవడం వల్ల భద్రత మరింత మెరుగుపడుతుంది. విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయి. బంజారాహిల్స్ వంటి విలాసవంతమైన ప్రాంతాలు గజిబిజి కేబుళ్ల గందరగోళం ఉండదు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications