అమెరికాలో సమ్మక్క, సారక్క జాతర.. మామూలుగా లేదుగా.. వైరల్ వీడియో!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర ఘనంగా ముగిసింది. జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా మేడారం జాతరను నిర్వహించారు. ఈసారి మేడారం జాతరకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడం కోసం న్యూజిలాండ్ కు చెందిన గిరిజన తెగ మేడారం వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి సాంప్రదాయ గిరిజన నృత్యాలు చేశారు.
మేడారం జాతర.. ఇక్కడే కాదు విదేశాలలో కూడా
దేశ విదేశాలలోనూ మేడారం జాతర పేరు మారుమోగాలని ప్రభుత్వం ఈసారి జాతరకు చాలా ప్రాధాన్యతనిచ్చింది. మేడారం జాతరను చూడడం కోసం ఎంతోమంది విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు ప్రత్యేక విమాన టికెట్లను బుక్ చేసుకొని మరీ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడకు రాలేకపోయిన కొందరు విదేశాలలోనే సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకొని అమ్మవార్ల పట్ల తమ భక్తిని చాటుకున్నారు.

అమెరికాలో మేడారం జాతర చేసిన యువత
ఈ క్రమంలో అమెరికాలో సమ్మక్క సారలమ్మ జాతర పేరుతో కొందరు యువత నిర్వహించిన జాతర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అమ్మవార్లకు ఇష్టమైన బెల్లాన్ని సమ్మక్క సారలమ్మలు గా ప్రతిష్టించి యువత పూజలు నిర్వహించారు. మేడారం జాతరలో చేసినట్టుగానే మద్యం సాక పోసి, మాంసాహారం పెట్టి ధూప దీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి చల్లగా చూడాలని వేడుకున్నారు.
సోషల్ మీడియాలో అమెరికా మేడారం జాతర వీడియో వైరల్
అనంతరం యువతీ యువకులందరూ ఒకే చోట సామూహిక భోజనాలు చేసి జాతరను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరు చేసిన ఈ వీడియోకు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఒక పాటను కలిపి పెట్టడంతో అది మరింత వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారందరూ అమెరికాలో సమ్మక్క సారలమ్మ జాతర అట్లుంటది మనతోటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సమ్మక్క సారలమ్మ గద్దెలు కడితే సెట్
అమెరికాలో కూడా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు కడితే సెట్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగే గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అమెరికాలో కూడా ఘనంగా నిర్వహించారు.
-
కరెంట్ బిల్: కట్టిన డబ్బులు వాపస్.. ఎలాగో చూడండి! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications