జంపన్న వాగు వద్ద భక్తుల రద్దీ.. బాలింతల కోసం ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు
మేడారం మహాజాతర ఈరోజు నుంచి 4 రోజుల పాటు జరగనుంది. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి మేడారం జాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమ్మక్క- సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా పేరొందిన మేడారం మహా జాతర ఈరోజు ప్రారంభం అయింది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది. దాంతో ములుగు జిల్లాలోని అడవులన్నీ భక్తజనసంద్రంగా మారాయి. ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం. సారలమ్మ గద్దెపైకి వస్తున్న తరుణంలో వేలాది మంది భక్తులు జంపన్న వాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది.
ఈ నేపథ్యంలో భక్తులు జాతర వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 4 వేల బస్సులు మేడారంకు బయల్దేరుతున్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో దాదాపు 3200 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 900 వరకు మేడారం జాతర కోసం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.

మరోవైపు మేడారం జాతరకు వరంగల్ రీజినల్ ఆధ్వర్యంలో నేటి వరకు దాదాపు 1998 ట్రిప్పుల్లో 88, 686 మంది ప్రయాణికులను ఆర్టీసీ చేరవేసింది. ప్రధానంగా మేడారంలో 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో తాత్కాలిక ఆర్టీసీ బస్ స్టేషన్ ఏర్పాటుచేసి 9 కిలోమీటర్ల మేర 20వేల మంది నిలబడే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. దాంతో పాటు దాదాపు 1000 బస్సులు పార్కింగ్ చేసే విధంగా 25.76 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. అలాగే మేడారం జాతరలో బాలింతల కోసం ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పిల్లలకు పాలివ్వడానికి అన్ని రకాల సౌకర్యాలతో ఈ ఫీడింగ్ సెంటర్స్ ను నెలకొల్పారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications