
బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు ఆపాలి; ఉద్యోగుల ఊపిరి తీస్తున్న 317జీఓ రద్దు చెయ్యాలి: ఎమ్మెల్యే సీతక్క
ఉద్యోగుల ఊపిరి తీస్తున్న 317జీఓ రద్దు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. జోనల్ మరియు మల్టీ జోనల్ పోస్టుల విషయం లో ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. స్థానికత ఆధారంగా రిక్రట్మెంట్ చెయ్యాలని, ఉద్యోగులకు స్థానికంగానే ప్రాధాన్యత కల్పించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల డ్రామాలు ఆపాలన్న ఎమ్మెల్యే సీతక్క
317 జీఓ ను రద్దు చేయాలని కోరుతూ జాతీయ రహదారి పై బైటాయించి ములుగు ఎమ్మెల్యే సీతక్క నిరసన వ్యక్తం చేశారు. ములుగు కేంద్రములో ములుగు మండలం,మరియు వెంకటా పూర్ మండలాల కార్యకర్తలతోజీఓ నెంబర్ 317 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జాతీయ రహదారి పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోధర్నా, రాస్తో రోకో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పోరాడి సాధించుకున్న తెలంగాణ లో ఉన్న చోట ఉండనివ్వకుండా ఉద్యోగులతోచెలగాటం ఆడుతున్నారు అని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బిజెపి, టి.ఆర్.ఎస్ పార్టీల డ్రామాలు ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

317 జీవో రద్దు చేయాలని సీతక్క డిమాండ్
ఉద్యోగుల అలాట్మెంట్ ప్రక్రియలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని 317 జీవో రద్దు చేయాలనిదీని వల్ల అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్నాభిన్నమై శాశ్వతంగా వాళ్ల స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోరాటానికి మూల సిద్ధాంతమైన స్థానికతను మరిచిపోయారని సీతక్క మండిపడ్డారు. సకల జనుల సమ్మె, మానవహారం, సహాయ నిరాకరణ లాంటి వీరోచిత పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పక్కకు పెట్టడం వారిని వారి స్థానిక ప్రాంతాలకు దూరంగా నెట్టి వేయడం దురదృష్టకరమని సీతక్క అసహనం వ్యక్తం చేశారు.
స్థానికత ప్రాధాన్యత అన్న సీతక్క
కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి ఉన్న నాలుగు డిఏలను వెంటనే మంజూరు చేయాలని, సి పి ఎస్ ను రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని సీతక్క డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి317 జీవో ప్రకారం నష్టపోయిన స్థానికతను కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు తిరిగి వారి వారి స్థానిక జిల్లాలో, జోన్లలో, మల్టీ జోన్లలో అవకాశం కల్పించాలని కోరారు. గతంలో 610 జీవో ద్వారా కూడా స్థానికత ఆధారంగానే ఉద్యోగ, ఉపాధ్యాయులని వారి వారి సొంత జిల్లాలకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వేసిన దాఖలాలు ఉన్నాయని సీతక్క పేర్కొన్నారు.

ఉద్యోగుల ప్రాణాలను తీస్తున్న జీఓ నెంబర్ 317 రద్దు చెయ్యండి
ఇది కేవలం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య కాదు భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగ ఖాళీలు ఉండే అవకాశం లేకుండా చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాబట్టి వెంటనే ప్రభుత్వం 317 జీవో ను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రక్రియ జరపాలని, ఉద్యోగుల ప్రాణాలను తీస్తున్న జీఓ నెంబర్ 317 రద్దు చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.

స్పందించకుంటే ఉద్యమం తప్పదు .. సీతక్క వార్నింగ్
బిజెపి, టి.ఆర్.ఎస్ పార్టీల డ్రామాలు ఆపాలన్న ఎమ్మెల్యే సీతక్క జోనల్ మరియు మల్టీ జోనల్ పోస్టుల విషయం లో ఉద్యోగ సంఘాల తో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్పౌ స్ బదిలీలు అన్ని జిల్లాలకు వర్తింపజేయాలి అని పేర్కొన్నారు. జూనియర్లను ఏజెన్సీ ప్రాంతాల్లో బదిలీ చేయడం వలన ఇంకా 20 యేండ్ల వరకు కొత్త ఉద్యోగాలు భర్తీ అయే అవకాశం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై స్పందించకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులను చైతన్య పరిచి ఉద్యమిస్తామని సీతక్క వార్నింగ్ ఇచ్చారు.