ఎన్నికలేవైనా ప్రజలు కేసీఆర్ వెంటేనన్న ఎమ్మెల్సీ కవిత, దొంగప్రమాణాలు చేసినందుకు ఫలితమన్న మంత్రి సత్యవతి

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఏవైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. మునుగోడు తీర్పు బీజేపీ నేతలకు చెంపపెట్టు అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

అవాకులు చెవాకులు పేలిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం చెప్పారు: కవిత

అవాకులు చెవాకులు పేలిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం చెప్పారు: కవిత

నేడు నిజామాబాద్ లో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ఏవైనా ప్రజలంతా కెసిఆర్ వెంటే ఉంటున్నారని ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇంతకాలం అవాకులు చెవాకులు పేలిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం చెప్పారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు దీనికి నిదర్శనమని కవిత తెలిపారు.

ఎన్నికలు ఏవైనా ప్రజలు కేసీఆర్ వెంటే: కవిత

ఎన్నికలు ఏవైనా ప్రజలు కేసీఆర్ వెంటే: కవిత


ఇక ఇదే సమయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా పూజలు నిర్వహించాలని కవిత తెలిపారు. ఆలయంలో స్వామివారి రథం అవసరం ఉందని, 50 లక్షల రూపాయలతో రథం చేయిస్తానని కవిత తెలిపారు. ఎంతో మహిమగల నీలకంఠేశ్వర స్వామిని కార్తీకపౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని పేర్కొన్న కవిత ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టిఆర్ఎస్ వైపే ఉంటారని విశ్వాసం తనకు ఉందని తెలిపారు.

మునుగోడు విజయంపై సత్యవతి రాథోడ్ హర్షం

మునుగోడు విజయంపై సత్యవతి రాథోడ్ హర్షం


టిఆర్ఎస్ పార్టీపై నోటికొచ్చినట్టు మాట్లాడిన వారికి చెంప చెళ్ళుమనే తీర్పు మునుగోడు ప్రజలు ఇచ్చారని ఇప్పటికే తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా మునుగోడు లో ప్రజలు అందించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో విజయం ద్వారా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు. నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.

దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు నరసింహస్వామి తగిన బుద్ధి చెప్పారు

దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు నరసింహస్వామి తగిన బుద్ధి చెప్పారు

మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీతో మూడున్నర ఏళ్లలో అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గం ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తగిన బుద్ధి చెప్పారని సత్యవతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పంతో దేశంలో అన్ని రాష్ట్రాలలో గొప్ప అభివృద్ధిని తీసుకు రావడం ఖాయమని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. దేశంలో గిరిజనులు, దళితులు, రైతులు, మహిళలు కెసిఆర్ పాలనతోనే సుభిక్షంగా ఉంటారని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని ఆదరించారని, ప్రజలకు సత్యవతి ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+