వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దివ్యాంగులకు ఎమ్మెల్సీ చేయూత.!ముగ్గురు దివ్యాంగులకు స్కూటీలను అందించిన కవిత.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్న కవిత ప్రజా సమస్యల పట్ల కూడా చురుగ్గా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అంగ వైకల్యంతో అసహాయ స్థితిలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ నేనున్నాననే భరోసా కల్పిస్తున్నారు కవిత. దీంతో ఎంతో మంది అంగవైకల్యంతో ఆత్మ న్యూనతా భావంతో జీవనం నెట్టుకొచ్చే వారికి మనసిక స్తైర్యాన్ని కల్పిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత.

ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత, మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు ఎమ్మెల్సీ ‌కవిత. వివిధ ‌కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్ కు చెందిన నరేష్, సుల్తానాబాద్ కు చెందిన ఉమా మహేష్ లకు హైదరాబాద్ లో మూడు చక్రాల స్కూటీలను ఎమ్మెల్సీ కవిత ఉచితంగా అందజేసారు.

 MLC Kavitha that provided the Scooters to the three physical Disable persons.!

కరీంనగర్ జిల్లా కుమ్మర్ పల్లికి చెందిన శ్రీనివాస్ వెన్నెముక సమస్యతో బాధపడుతూ, నడవలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ పరిస్థితి గురించి అతని స్నేహితుడు ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా శ్రీనివాస్ పరిస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, అతని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో శ్రీనివాస్ కు స్కూటీని అందజేసారు.

సుల్తానాబాద్ మండలం కంఠినెపల్లి గ్రామానికి చెందిన ఉమా మహేష్, మహబూబ్ నగర్ జిల్లా మార్కెల్ గ్రామానికి చెందిన నరేష్ దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రెండు కాళ్ళూ తీవ్రంగా దెబ్బతిని, వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఉమా మహేష్, నరేష్ ల దీనస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, స్కూటీలు అందించి చేయూతనిచ్చారు.

ముగ్గురికి మూడు చక్రాల స్కూటీని అందించిన ఎమ్మెల్సీ కవిత, ఎలాంటి సమస్య వచ్చినా అధైర్య పడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు. సోషల్ ‌మీడియా లో పెట్టిన విజ్ఞప్తికి వెంటనే స్పందించడంతో పాటు, సాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత కు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ కవిత ‌ జన్మదినం సందర్భంగా వారి అభిమానులు 30 మంది విద్యార్థులకు సైకిళ్లు, ఆరుగురు దివ్యాంగులకు స్కూటీలను అందించడం గమనార్హం.

English summary
mlc Kavitha, once again expressed a great mind.About three young men who become paralyzed by fate Given Scooters by mlc Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X