కొడుకు ఆర్య చేసిన పనికి ఉబ్బితబ్బిబ్బైన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. బీఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పర్యావరణ పరిరక్షణ పై ప్రాజెక్టులు రూపొందించిన తన కుమారుడు ఆర్య ను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

ఖాజా గూడాలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ పై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన అనేక ప్రాజెక్టులను అక్కడికి వచ్చిన ఎందరో ఆసక్తిగా తిలకించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కొడుకు చేసిన ప్రాజెక్టును తిలకించి ప్రాజెక్టు తాలూకు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 MLC Kavitha was happy and felt proud of son arya project on the environment

కొడుకు చెబుతున్న తీరుకు మురుసుకున్నారు. తన కుమారుడితో పాటు స్కూల్లో పర్యావరణ ప్రాజెక్టులను చేసిన ఇతర విద్యార్థులను సైతం ఎమ్మెల్సీ కవిత అభినందించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చిన్నారుల ఆలోచనలను కవిత అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. తన కుమారుడు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆర్య ప్రాజెక్టును రూపొందించటం చూసి ఒక తల్లిగా గర్వపడుతున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫోటోలతో పాటు పంచుకున్న ఎమ్మెల్సీ కవిత తన చిన్న కొడుకు ఆర్య పాఠశాలను సందర్శించానని, అక్కడ అతను మరియు అతని సహవిద్యార్థులు వారి పర్యావరణ పరిరక్షణ కోసం వ్యక్తిగత ప్రాజెక్ట్ లను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఒక తల్లిగా, ఆర్య తను పనిచేసిన ప్రాజెక్ట్‌ని ప్రెజెంట్ చేయడం వినడం నాకు సంతోషం మరియు గర్వకారణం అంటూ కవిత ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కవిత తరహాలో మంత్రి కేటీఆర్ కూడా కొడుకు హిమాన్షు విషయంలో పుత్రోత్సాహాన్ని ట్విట్టర్ వేదికగా ప్రదర్శిస్తూనే ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+