నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి,10 మందికి తీవ్ర గాయాలు...
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ సమీపంలోని చింతపల్లి హైవే వద్ద ఓ ప్రైవేట్ టావెల్స్ బస్సు రోడ్డుపైన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు
ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జున్(40),నాగేశ్వర్‌రావు(44),గుంటూరు జిల్లాకు చెందిన జయరావ్(42)లుగా గుర్తించారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం,అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదే నల్గొండ జిల్లాలో ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్-నాగార్జున సాగర్హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా... మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా పీఏపల్లి మండలం రంగారెడ్డి గూడెంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.
మార్గమధ్యలో ఓ బొలెరో వాహనం అదుపు తప్పి ఆటో వైపు దూసుకొచ్చింది. దాన్ని తప్పించేందుకు ఆటో డ్రైవర్ మల్లేశం... వాహనాన్ని రోడ్డు మధ్యకు తిప్పాడు.దీంతో అటుగా వస్తున్న లారీ ఆటోను అతివేగంతో ఢీకొట్టింది. దీంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జవగా కూలీలంతా చెల్లాచెదురుగా చెడిపోయి ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. కూలీలంతా మరో అరగంటలో ఇల్లు చేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం అందరినీ కలచివేసింది.
Recommended Video
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications