తెలంగాణలోని మందు బాబులకు గుడ్ న్యూస్
న్యూ ఇయర్ వేళ తెలంగాణలోని మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31న బార్లకు, క్లబ్ లకు, ఈవెంట్ లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. అలాగే వైన్ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చింది. మరోవైపు ఈ నెల 30, 31న ప్రత్యేక తనిఖీలు ఉంటాయని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ స్పష్టం చేసింది.
నూతన సంవత్సరం నేపథ్యంలో తెలంగాణలోని మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ మేరకు కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. డిసెంబర్ 31 న బార్లు, క్లబ్ లు, ఈవెంట్ లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకూ అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. దాంతోపాటు వైన్ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎక్సైజ్, నార్కోటిక్స్, పోలీసుల ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్స్ లో తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించుకోవాలని.. నిబంధనలు అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యంగా.. ప్రమాదాలను నివారించేందుకు డిసెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు నగరవ్యాప్తంగా 'స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ డ్రైవ్' ను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ ను ఏమాత్రం సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications