వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాన్ తెలంగాణ బీజేపిది.!అమలుచేసింది మాత్రం కేంద్ర బీజేపి.!బెడిసికొట్టిన కేసీఆర్ వ్యూహం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో అనూహ్యంగా పటిష్టమవుతున్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ పట్టు సాధిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో సహా ప్రధాన మంత్రిని సైతం తమ చెప్పుచేతల్లో వెట్టుకున్నట్టు ఇటీవల జరిగిన పరిణామాలు రుజువుచేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ ప్రజాభిమానం పొందుతున్న ప్రస్తుత తరుణంలో ఏ చిన్ని పొరపాటుకు కూడా తావివ్వకూడదని పకడ్బంవధీ ప్రణాళికతో తెలంగాణ బీజేపి అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధానంగా రాష్ట్రంలో బీజేపిని ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ, కేంద్రంతో పనులు చేయించుకుంటూ ఆ క్రెడిబిలిటీని తన ఖాతాలో వేసుకుంటూ తెలంగాణ బీజేపి నేతలను నిస్సహాయలుగా చేస్తున్న చంద్రశేఖర్ రావు వైఖరిని ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులకు దృష్టికి బలంగా తీసుకెళ్లగలిగారు తెలంగాణ బీజేపి నేతలు. దాని పర్యవసానమే, తాజాగా డిల్లీ వెళ్లిన సీఎం చంద్రశేఖర్ రావుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా కేంద్రమంత్రులు నిరాకరించినట్టు నిర్థారణ అవుతోంది.

 ఇది కేసీఆర్ ద్వంద్వ విధానం..

ఇది కేసీఆర్ ద్వంద్వ విధానం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్, టీడీపీ పాలన కంటే తెలంగాణలోని చంద్రశేఖర్ రావు హయాంలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని, సీఎం కుటుంబ అవినీతి, నియంత పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని పలు వేదికల మీద బీజేపి నేతలు వివరిస్తున్నారు. ప్రజలు చంద్రశేఖర్ రావు పాలనకు చరమ గీతం పాడాలని భావిస్తున్నారని కూడా బీజేపి నేతలు చెప్పుకొస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారుని, అవినీతి, నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుండి వచ్చిన స్పందన ఈ అంశాన్ని దృవీకరిస్తోందని బీజేపి నేతలు పేర్కొంటున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పట్టు కోల్పోతామని బీజేపి నేతలు భావిస్తుంన్నారు. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు జిమ్మిక్కులను ముందుగానే పసిగట్టి ఎండగడుతున్నారు బీజేపి నేతలు.

అక్కడ అపాయింట్ మెంట్ ఇవ్వొద్దు..

అక్కడ అపాయింట్ మెంట్ ఇవ్వొద్దు..

బీజేపీకి అవకాశం ఇస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రం అభివ్రుద్ది జరుగుతుందనే భావనలో ప్రజలు ఉన్నారని, ఈ తరుణంలో ప్రజలకు విశ్వాసం కల్పించి వారి పక్షాన పోరాడాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉందని రాష్ట్ర నాయకత్వం విశ్వసిస్తోంది. కుటుంబాలకు దూరమై పార్టీ కోసం పనిచేసిన నాయకులెందరో బీజేపీలో ఉన్నారని, అలాంటి నాయకుల క్రుషి వల్లనే ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చే పరిస్థితి ఏర్పడిందని నాయకులు నమ్ముతున్నారు.

వారి స్పూర్తితోనే పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది తెలంగాణ బీజేపి నేతల వాదన.అవినీతి, కుటుంబ పాలనను బీజేపీ ఎన్నటికీ సహించదని, అందుకే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బీజేపీని ప్రత్యామ్నయ పార్టీగా చూస్తున్నారని వివరిస్తున్నారు.

బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారు..

బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారు..

సరిగ్గా ఇలాంటి తరుణంలో పక్కా ప్రణాళికతో మరింత పటిష్టంగా ముందుకు వెళ్లాల్సిన తరుణంలో తప్పటడుగులు వేయొద్దని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. తెలంగాణ సీఎం చంద్రవేఖర్ రావు మీడియా సమావేశాలు నిర్వహించి తెలంగాణ బీజేపి పార్టీని, నాయకులను నీచంగా దూషిస్తుంటారని, కేంద్ర ప్రభుత్వంలో అదే బీజేపి నేతలతో సత్సంబాంధాలు కోరుకుంటారని ధ్వజమెత్తారు.

స్థానికంగా బీజేపీని దూషించి కేంద్రంలో అభినందించడం చంద్రశేఖర్ రావు ధ్వంద్వ విదానాలకు నిదర్శనాలని బీజేపి మండిపడుతోంది. తాజాగా విలేఖరులు సమావేశం నిర్వహించి, స్థానికి బీజేపి మీద అబండాలు మోపి ఢిల్లీ బీజేపితో తాడో పేడో తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన చంద్రవేఖర్ రావుకు తెలంగాణ బీజేపి నేతలు సరైన గుణపాఠం చెప్పినట్టు తెలుస్తోంది.

 ఇది తెలంగాణ బీజేపి ప్రణాళిక..

ఇది తెలంగాణ బీజేపి ప్రణాళిక..

ఢిల్లీ లోని ప్రదాని మోదీ తో సహా కేంద్ర మంత్రులను తెలంగాణ బీజేపి నేతలు టైట్ చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ కేంద్ర మంత్రులతో, ప్రధాని మోదీతో ఎలాంటి చర్చలు జరుగుతాయో ఎవ్వరికీ తెలియదు కానీ చంద్రశఖర్ రావు బిల్డప్ అనూహ్యంగా ఉంటుందని, చంద్రశేఖర్ రావు ఆలోచనా విధానాన్ని కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని సైతం ప్రశంసించారనే సొంత ప్రచారం చేసకుంటారని, ప్రధాని మోదీ తన చెవులో ఎన్నో రహస్యాలు చెప్పారని చంద్రశేఖర్ రావు స్వయంగా తెలంగాణ ప్రజానికానికి వివరిస్తారని కేంద్ర పెద్దలకు రాష్ట్ర బీజేపి నేతలు ఉప్పందించారు.

దీంతో తెలంగాణ బీజేపి నేతల ప్రతిపాదనల ప్రకారం తెలంగాణ సీఎం చంద్రవేఖర్ రావు బృందానికి అపాయింట్ మెంట్ ఇవ్వకూడదనే తుది నిర్ణయానికి కేంద్రమంత్రులతో పాటు ప్రధాని వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రశేఖర్ రావు బృందానికి ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్ ససేమిరా అన్నారని తెలంగాణాలోతారా స్ధాయిలో చర్చ జరుగుతోంది.

English summary
The Telangana BJP leaders were able to bring Chandrasekhar Rao's stance to the attention of Union Ministers, including the Prime Minister. As a result, it is being confirmed that the Union Ministers have refused to even give at least an appointment to CM Chandrasekhar Rao, who recently went to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X