అల్లు అర్జున్ పై ఛార్జ్ షీట్, వెంటాడుతున్న తొక్కిసలాట..!!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుష్ప-2 బెన్ ఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు ఇప్పటికీ కోలుకోలేదు. పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. కాగా, ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో అల్లు అర్జున్ ను ఏ -11 గా పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులను ఛార్జ్ షీట్ లో చేర్చారు.
గత ఏడాది పుష్ప 2 విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసులు 23 మంది నిందితులను ఛార్జ్ షీట్లో చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ను ఏ11గా.. సంధ్య థియేటర్ యాజమాన్యా న్ని ఏ1గా చేర్చారు.

ముగ్గురు మేనేజర్లు , 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్లో చేర్చారు. అంతేకాదు నలుగురు ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. ఈ ఘటనలో గాయ పడిన శ్రీజిత్ ఇప్పటికే మంచానికే పరిమితం అయ్యాడు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్లు పడ్డాయి.
ప్రీమియర్ షో చూడ్డానికి హైదరాబాద్‌కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటుచేసు కుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే చనిపోయింది. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ తొక్కిసలాట కేసుకు సంబంధించి గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. జైలులో కూడా ఉన్నారు.
కాగా, ప్రమాదం జరిగి సంవత్సరం అయినా కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇప్పటికీ మాట్లాడలేకుండా.. నడవలేకుండా ఉన్నాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక, శ్రీ తేజ్ ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ 75 లక్షల రూపాయలు సాయం చేశారు. అంతేకాదు.. భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవటానికి 2 కోట్ల రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు గతంలోనే వెల్లడించారు.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications