యాదాద్రి కేంద్రంగా పొలిటికల్ హీట్.. ప్రమాణం చేస్తానంటున్న బండి సంజయ్, నల్లజెండాలతో టీఆర్ఎస్!!

మునుగోడు ఉపఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతుంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి బిజెపి ప్రయత్నం చేసిందని, టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన బీజేపీ కుట్రలు చేస్తోందని టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంలో కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం అంతా టిఆర్ఎస్ పార్టీ దేనని, తమకు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం లేదని బిజెపి నేతలు తేల్చి చెప్పారు.

యాదాద్రిలో ప్రమాణం చెయ్యటానికి బయలుదేరిన బండి సంజయ్

యాదాద్రిలో ప్రమాణం చెయ్యటానికి బయలుదేరిన బండి సంజయ్

ఇక ఒక్క అడుగు ముందుకు వేసి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని, దమ్ముంటే సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. బండి సంజయ్ అక్కడితో ఆగకుండా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బయలుదేరారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్ మర్రిగూడ లో ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక తాజా పరిణామాలతో యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయడానికి బండి సంజయ్ తన కారులో బయలుదేరారు.

పోలీసులు అడ్డుకున్నా ప్రమాణం చేసి తీరుతా అంటున్న బండి సంజయ్

పోలీసులు అడ్డుకున్నా ప్రమాణం చేసి తీరుతా అంటున్న బండి సంజయ్

అయితే బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో ప్రమాణం నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా , ఎట్టి పరిస్థితులలోనూ తాను ప్రమాణం చేసి తీరుతానని బండి సంజయ్ తేల్చిచెప్పారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయానికి వచ్చి తనతోపాటు ప్రమాణం చేయాలని బండి సంజయ్ సూచించారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు, ఆయనను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

యాదాద్రిలో టీఆర్ఎస్ నల్ల జెండాలతో ర్యాలీ .. యాదాద్రిలో టెన్షన్

యాదాద్రిలో టీఆర్ఎస్ నల్ల జెండాలతో ర్యాలీ .. యాదాద్రిలో టెన్షన్

ఇక మరోవైపు బండి సంజయ్ యాదాద్రి ఆలయానికి ప్రమాణం చేయడానికి వస్తారని చెబుతున్న క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు యాదాద్రి లో నల్లజెండాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఎట్టి పరిస్థితులలోనూ బండి సంజయ్ ను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఇక ఏ మాత్రం తగ్గని బీజేపీ, ఆందోళనల బాట పట్టిన టీఆర్ఎస్ నేతల తీరుతో యాదాద్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు యాదాద్రిలో భారీగా మోహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+